Bigg Boss Telugu 5: పింకీతో రిలేషన్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన మానస్‌.. కాజలే కారణమట..

By Aithagoni RajuFirst Published Nov 30, 2021, 11:47 PM IST
Highlights

గార్డెన్‌ ఏరియాలో షణ్ముఖ్‌.. పింకీ కోసం ఏమైనా చేశాడా? అంటూ నిలదీశాడు మానస్‌. లేదంటూ బదులిచ్చింది. దీంతో ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆలోచించుకో అంటూ వెళ్లిపోయేందుకు లేచాడు మానస్‌.

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5), 87వ ఎపిసోడ్‌ మానస్‌-ప్రియాంక సింగ్ ల రిలేషన్‌ మధ్య సంఘర్షణ హైలైట్‌గా సాగింది. ఓ వైపు పింకీ వెంటపడుతుంటే మానస్‌ చిరాకుగా వెళ్లిపోవడం, ఈ క్రమంలో ఆమె ఫైర్‌ అవ్వడం, షణ్ముఖ్‌.. పింకీని రెచ్చగొట్టడం, మరోవైపు కాజల్‌పై పింకీ వివాదాస్పద కామెంట్లు చేయడం హైలైట్‌గా నిలిచింది. Bigg Boss Telugu 5..13వ వారం నామినేషన్‌ అనంతరం పింకీ, మానస్‌ ల మధ్య డిస్కషనే ప్రధానంగా సాగింది. ఇందులో మానస్‌, పింకీలు.. నామినేషన్లకి సంబంధించి డిస్కషన్‌ జరిగింది. 

గార్డెన్‌ ఏరియాలో షణ్ముఖ్‌.. పింకీ కోసం ఏమైనా చేశాడా? అంటూ నిలదీశాడు మానస్‌. లేదంటూ బదులిచ్చింది. దీంతో ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆలోచించుకో అంటూ వెళ్లిపోయేందుకు లేచాడు మానస్‌. దీంతో కూర్చో నేను నీతో మాట్లాడాలి అన్నది పింకీ. కానీ మానస్‌ వినకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో నేను మాట్లాడేది మనిషిని కాదా? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, వినకుండా అలా వెళ్లిపోతావేంటి? అంటూ ప్రశ్నించింది. నేను చెప్పాల్సింది చెప్పాను, వెళ్లిపోతున్నా అన్నాడు మానస్‌. నేను చెప్పేది వినవా? మాకు రెస్పెక్ట్ ఇవ్వవా అంటూ పింకీ ప్రశ్నించింది. నువ్వు చెప్పిందే పదేపదే చెబుతావని, నేను వినను అని తేల్చి చెప్పాడు మానస్‌. దీంతో సీరియస్‌ అయి నేను కూడా నీతో మాట్లాడను అంటూ వెళ్లిపోయింది పింకీ. 

దీంతో అటు సన్నీ,ఇటు కాజల్‌ ఈ విషయంపై మానస్‌ని సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇదే ఛాన్స్ గా తీసుకుని షణ్ముఖ్‌.. పింకీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కాజల్‌ నీ కోసం ఏమైనా చేసిందా? అని, పేరెంట్స్ వచ్చినప్పుడు తమ ముగ్గురు పేరెంట్స్ వచ్చినప్పుడు హమ్మయ్య మాలో అందరు అయిపోయారు అని చెప్పింది. నిన్ను కలపలేదు అని పింకీతో అన్నాడు షన్ముఖ్. దీని తర్వాత కిచెన్‌లోనూ మరోసారి మానస్‌,పింకీల మధ్య డిస్కషన్‌ వచ్చింది. ఆ సమయంలో నువ్వంటే ఇష్టం లేదు, నచ్చడం లేదని, నీతో మాట్లాడటం ఇష్టం లేదంటూ ఫైర్‌ అయ్యాడు మానస్‌. తమ రిలేషన్స్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు. దీంతో పింకీ షాక్‌ అయ్యింది. 

నువ్వు ఇంకేదో ఆశిస్తున్నావని నిలదీశాడు. దీనికి ఫీల్‌ అయిన పింకీ తాను ఫ్రెండ్‌షిప్‌నే కోరుకుంటానని, నువ్వు నా ఫ్రెండ్‌ అని, నువ్వు అంటే నేను చాలా బాధపడతానని బాత్‌ రూమ్‌లో గట్టిగా ఏడ్చింది. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ పింకీ, మానస్‌ల మధ్య డిస్కషన్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. కాసేపు స్పేస్‌ కావాలని మానస్‌ అన్నా పింకీ వినకుండా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, కాజల్‌ మధ్యలో వారించింది. మానస్‌తో తనతో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వస్తున్నావని చెప్పింది. దీంతో కాజల్‌పై గట్టిగా ఫైర్‌ అయ్యింది పింకీ. నువ్వే మానస్‌ని ప్రోవోక్‌ చేస్తున్నావని, నీవల్లే గొడవలొస్తున్నాయంటూ మండిపడింది. ఆ తర్వాత చివర్లో మానస్‌, పింకీ హగ్‌ చేసుకోవడంతో హీటు కాస్త చల్లారింది. 

అనంతరం బిగ్‌బాస్‌ ఫైనల్‌లో చోటు సంపాదించేందుకు మొదటి ఫైనలిస్ట్ టాస్క్ ఇచ్చాడు. `టికెట్‌ ఫినాలే` పేరుతో ఇచ్చిన టాస్క్ లో ఇంటి సభ్యుల వద్ద వారికి కేటాయించిన రంగు బాల్స్ ఉంటాయి. అవి గేమ్‌ పూర్తయ్యేంత వరకు ఎవరి ఎవరి వద్ద ఎక్కువ ఉంటాయో వాళ్లు విన్నర్‌గా నిలుస్తారు. ఫైనల్‌కి వెళతారు. ఈ గేమ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. అదే సమయంలో హౌజ్‌కి కెప్టెన్‌ బాధ్యత ఈ రోజు నుంచి పూర్తవుతుందని, ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న షణ్ముఖ్‌ నుంచి బ్యాండేజ్‌ తీయించాడు బిగ్‌బాస్‌. ఇకపై రెండు వారాలు కెప్టెన్‌ లేకుండానే హౌజ్‌లో సభ్యులు  ఉండబోతున్నారు. ఇక ఈ వారం నామినేషన్‌లో శ్రీరామ్‌, కాజల్‌, సిరి, పింకీ, మానస్‌ లున్న విసయం తెలిసిందే.

also read: Bigg Boss Telugu 5: సిరి మదర్‌ ఇచ్చిన స్ట్రోక్స్ కి వణుకుతున్న షణ్ముఖ్‌.. మొత్తానికి కాజల్‌ బకరా అయిపోయిందిగా

click me!