Kriti sanon: ప్రభాస్ నా తప్పులు సరిదిద్దారు

Published : Nov 01, 2021, 11:57 AM IST
Kriti sanon: ప్రభాస్ నా తప్పులు సరిదిద్దారు

సారాంశం

రాముడు Prabhas కి జంటైన సీత పాత్రను బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. తాజాగా ఆమె మూవీతో పాటు, హీరో ప్రభాస్ పై ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మొదటిసారి మైథలాజికల్ చిత్రం చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో ఆయన రామునిగా కనిపించనున్నారు. కాగా రాముడు Prabhas కి జంటైన సీత పాత్రను బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. తాజాగా ఆమె మూవీతో పాటు, హీరో ప్రభాస్ పై ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

పాన్‌ఇండియా చిత్రం ఆదిపురుష్‌ లో నటించడం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని  చెప్పిన Kriti sanon‌, తొలిసారి ప్రభాస్‌ను సెట్‌లో కలిసినప్పుడు ఆయన చాలా సిగ్గరిగా అనిపించారు. అయితే కొద్దిరోజుల తర్వాత ఆయన అసలు వ్యక్తిత్వం తెలిసింది. సెట్‌లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటాడు. తెలుగులో నేను చెప్పే సంభాషణల్లో తప్పులుంటే సరిదిద్దేవాడు. గొప్ప స్టార్‌డమ్‌ కలిగిన హీరో అయినప్పటికీ అందరితో వినమ్రంగా మసలుకోవడం ఆయనలోని మంచి లక్షణం’ అని చెప్పింది. 

Also read RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!
ఇక Adipurush సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతున్నదని, గ్రాఫిక్‌ వర్క్‌ కీలకంగా ఉంటుందని పేర్కొంది. ‘భారీ బడ్జెట్‌ సినిమాను చిన్న చిన్న సెట్స్‌లో తీస్తుండటంతో ఆశ్చర్యపడ్డాను. వీఎఫ్‌ఎక్స్‌ ప్రధానం కావడంతో షూటింగ్‌ ఏరియాకు అంత ప్రాముఖ్యత ఉండదని నిపుణులు చెప్పారు. సినిమా ఎలా ఉంటుందో తెలియజేసే పెయింటింగ్స్‌ను నేను చూశాను. మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది’ అని కృతిసనన్‌ చెప్పింది. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌అలీఖాన్‌ ప్రతినాయకుడు లంకేష్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. 

Also read Pawan kalyan: దేవుడికే విసుగు పుట్టిస్తున్న భక్తుల భజన.. ఆయనే స్వయంగా చెప్పినా మారని ఫ్యాన్స్!
మరోవైపు ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న Salaar చిత్రానికి కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ జనవరి 14న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదలైన Radhe shyamటీజర్ ఆదరణ దక్కించుకుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?