అంత అసభ్యంగా నేను చేయలేను.. 'హేట్ స్టోరీ 4' పై నటి షాకింగ్ కామెంట్స్

pratap reddy   | Asianet News
Published : Nov 01, 2021, 11:33 AM IST
అంత అసభ్యంగా నేను చేయలేను.. 'హేట్ స్టోరీ 4' పై నటి షాకింగ్ కామెంట్స్

సారాంశం

వెండితెరపై అప్పుడప్పుడూ కొన్ని బోల్డ్ చిత్రాలు వస్తూ ఉంటాయి. ఓటిటి హవా పెరిగిన తర్వాత బోల్డ్ కంటెంట్ ఉండే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువయ్యాయి. దీనితో ఆ చిత్రాల్లో వర్తమాన నటీమణులకు ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.

వెండితెరపై అప్పుడప్పుడూ కొన్ని బోల్డ్ చిత్రాలు వస్తూ ఉంటాయి. ఓటిటి హవా పెరిగిన తర్వాత బోల్డ్ కంటెంట్ ఉండే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువయ్యాయి. దీనితో ఆ చిత్రాల్లో వర్తమాన నటీమణులకు ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. వెండితెరపై ఆఫర్స్ రానివాళ్లు ఇలా ఓటిటి వేదికగా తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఇది మంచి విషయమే. 

కానీ నటి, మోడల్ Himanshi Khurana సున్నితమైన విమర్శలు చేశారు. మోడల్ గా రాణించిన హిమన్షి ఖురానా Bigg Boss 13 తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆమె మోడల్ అయినప్పటికీ ఎప్పుడూ గ్లామర్ హద్దులు దాటలేదు. చూడచక్కనైన రూపంతో ఉండడంతో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కాని కొన్ని క్రేజీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసినట్లు హిమాన్షి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

OTT కంటెంట్, బోల్డ్ చిత్రాలపై సున్నితమైన విమర్శలు చేసింది. ఓటిటిలో వచ్చే చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. నాకు కూడా అలాంటి చిత్రాల్లో అవకాశం వచ్చింది. ఓటిటిలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే శృంగారభరితమైన, అసభ్యకరమైన సన్నివేశాల్లో నేన్ను నటించను అని తేల్చి చెప్పేసింది. 

Also Read: శ్రీముఖి అందాల విందు, బ్లూ డ్రెస్ లో మెరుపులు.. మెస్మరైజ్ చేస్తున్న హాట్ ఫోజులు

బాగా పాపులర్అయిన మూడు చిత్రాల్లో కూడా అవకాశాలు రిజెక్ట్ చేశానని హిమాన్షి రివీల్ చేసింది. అందులో ఒకటి Hate Story 4. ఆ మూవీలో అసభ్యకరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నా వల్ల కాదంటూ రిజెక్ట్ చేశాను అని హిమాన్షి పేర్కొంది.

Also Read: RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!

హేట్ స్టోరీ 4లో ఊర్వశి రౌతేలా, ఇహానా ధిల్లాన్ శృంగార భరిత సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. అలాంటి చిత్రాల్లో నటించమని అడిగారు.. బలవంతం చేయలేదు. నటించకూడదనేది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం అని హిమాన్షి పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?