కోట్ల ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య రాయల్ ఎంట్రీ... ఎవరి గిఫ్ట్ అంటే!

Published : Oct 18, 2021, 05:41 PM IST
కోట్ల ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య రాయల్ ఎంట్రీ... ఎవరి గిఫ్ట్ అంటే!

సారాంశం

అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్స్ లో ఒకటైన బెంట్లీ కారులో ఆయన ఈ ఈవెంట్ కి వచ్చారు. బాలయ్య రాయల్ ఎంట్రీ ఇచ్చిన లగ్జరీ కారును మీడియా తమ కెమెరాలలో బంధించారు. అదే సమయంలో Balakrishna కొత్త కారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

Unstoppbale టాక్ షో లాంచింగ్ ఈవెంట్ కి బాలయ్య ఓ లగ్జరీ కారులో రావడం జరిగింది. అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్స్ లో ఒకటైన బెంట్లీ కారులో ఆయన ఈ ఈవెంట్ కి వచ్చారు. బాలయ్య రాయల్ ఎంట్రీ ఇచ్చిన లగ్జరీ కారును మీడియా తమ కెమెరాలలో బంధించారు. అదే సమయంలో Balakrishna కొత్త కారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దాదాపు రూ. 4 నుండి 5 కోట్ల విలువ చేసే ఈ బెంట్లీ కారును బాలయ్యకు తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి గిఫ్ట్ గా ఇచ్చారట. కూతురు ఇచ్చిన కారులో బాలయ్య అన్స్టాపబుల్ ఈవెంట్ కి హాజరయ్యారు. 


Nara Bramhani సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తన సొంత సంపాదనతో బాలయ్యకు ఖరీదైన bentley car బహుమతి అందించారు. ఇక ఆహా యాప్ కోసం బాలయ్య టాక్ షో హోస్ట్ గా మారారు. అన్స్టాపబుల్ పేరుతో ప్రసారం కానున్న ఈ షోలో మెగా హీరోలతో పాటు టాలీవుడ్ స్టార్స్ పాల్గొననున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి కావడం జరిగిందని సమాచారం. ఇక ఈ టాక్ షో కోసం దాదాపు రూ. 5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట బాలకృష్ణ. 

Also read Unstoppable talk show: బాలయ్యకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన అల్లు అరవింద్
మరోవైపు ఆయన లేటెస్ట్ మూవీ అఖండ షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రంపై బాలయ్య అభిమానులతో పాటు పరిశ్రమలో... ఆసక్తి నెలకొని ఉంది. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఓ కీలక రోల్ చేస్తున్నారు. Akhanda విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

Also read అఘోరా అయ్యింది, ఇప్పుడు స్వామీజీ గా బాలయ్య ?
 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా