తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షో ప్రసారం కానుంది. మరి ఈ షో కోసం బాలయ్య ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
నటసింహం బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్నారనే విషయమే సంచలనమైతే... అది మెగా నిర్మాత అల్లు అరవింద్ కి చెందిన ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కోసం చేయడం మరింత షాకింగ్ విషయం. ప్రేమైనా, ఆవేశమైనా దాచుకోకుండా చూపించే Balakrishna హోస్ట్ గా, టాక్ షో ఎలా ఉండబోతుంది అనే, ఆత్రుత అందరిలో నెలకొంది. మరి టాక్ షో హోస్ట్ అంటే సందర్భానుసారంగా విషయాలపై స్పందించడం, గెస్ట్స్ ఎమోషన్స్ ని అర్థం చేకోవడం చేయాలి. అలాగే హ్యూమరస్ గా వ్యవహరించాలి... ఈ బాధ్యత అంత సులభం కాదు.
ఇక హోస్ట్ అంటే గెస్ట్ కి గౌరవం ఇవ్వాలి, కొంచెం తగ్గి ప్రవర్తించాలి. యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బాలయ్య ఇలాంటివి చేయగలరా అంటే అనుమానమే. అయితే అన్ని టాక్ షోలు ఒకలా ఉండాలని వీలు లేదు. ఈ టాక్ షోల నియమాలు ఆయా నటుల స్థాయి, గెస్ట్, హోస్ట్ మధ్య ఉన్న సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా బాలయ్య హోస్ట్ గా టాక్ షో ఎలా ఉంటుందో చూడాలనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకులు కలిగి ఉన్నారు.
తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షో ప్రసారం కానుంది. మరి ఈ షో కోసం బాలయ్య ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సదరు కథనం ప్రతి ఎపిసోడ్ కి బాలకృష్ణ రూ. 40 లక్షలు తీసుకోనున్నారట. ఈ మేరకు Allu aravind, బాలయ్య మధ్య ఒప్పందం జరిగిందట. ఇక మొదటి సీజన్ కి గాను... మొత్తం 12 ఎపిసోడ్స్ ఉండనున్నాయట. అలా బాలయ్యకు ఈ షో ద్వారా రూ. 4.8 కోట్లు remunerations దక్కనున్నాయట.
Also read అఘోరా అయ్యింది, ఇప్పుడు స్వామీజీ గా బాలయ్య ?
మొదటి సీజన్ సక్సెస్ ఆధారంగా రెండవ సీజన్ పై అల్లు అరవింద్ నిర్ణయం తీసుకునే అవకాశం కలదు. గతంలో సమంత హోస్ట్ గా సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహించారు. టాలీవుడ్ స్టార్స్ హోస్ట్స్ గా పాల్గొన్నప్పటికీ ఈ షో అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు. దీనితో Samantha సామ్ జామ్ ని మొదటి సీజన్ తో ఆపేశారు.మరి బాలయ్యతో చేస్తున్న అల్లు అరవింద్ ప్రయోగం ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.
Also read మోహన్‌బాబుకి చిరంజీవి సంజాయిషీ.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్