వైద్యం కోసం వెళితే అసభ్యంగా తాకిన డాక్టర్.. సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్

pratap reddy   | Asianet News
Published : Oct 18, 2021, 03:47 PM IST
వైద్యం కోసం వెళితే అసభ్యంగా తాకిన డాక్టర్.. సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్

సారాంశం

సినీ ప్రియులందరికీ బాలీవుడ్ సీనియర్ నటి Neena Gupta గురించి తెలిసే ఉంటుంది. ఆమె జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. ప్రస్తుతం నీనా గుప్తా బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 

సినీ ప్రియులందరికీ బాలీవుడ్ సీనియర్ నటి Neena Gupta గురించి తెలిసే ఉంటుంది. ఆమె జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. ప్రస్తుతం నీనా గుప్తా బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన నీనా గుప్తా తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసింది. 

ఈ పుస్తకంలో తన యంగ్ ఏజ్ లో జరిగిన కొన్ని సంచలన విషయాలని రివీల్ చేసింది. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు డాక్టర్ నుంచి, ఓ టైలర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నీనా గుప్తా పేర్కొంది. ఆ సమయంలో తాను ఎంత వేదన అనుభవించానో పుస్తకంలో రాసుకొచ్చింది నీనా. 

నీనా గుప్తా తన ఆటోబయోగ్రఫీలో.. నేను ఓ సారి కంటి వైద్యుడి వద్దకు వెళ్లాను. మొదట డాక్టర్ నా కంటిని పరీక్షించాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన చేతులు కిందకు దించి కంటితో సంబంధం లేని ప్రదేశాల్లో అసభ్యంగా తాకడం మొదలు పెట్టాడు. నాకు చాలా నరకంగా అనిపించింది. ఏడుస్తూ ఇంటికి వెళ్లాను. మా అమ్మకు కనిపించకుండా ఓ మూలాన కూర్చుని చాలా సేపు ఏడ్చాను. ఈ సంఘటన గురించి మా అమ్మతో చెబుదామంటే నా ధైర్యం సరిపోలేదు. 

తిరిగి నన్నే ఎక్కడ బ్లేమ్ చేస్తుందో అని భయమేసినట్లు నీనా గుప్తా పేర్కొంది. ఓ టైలర్ నుంచి కూడా అదే వేధింపులు ఎదురయ్యాయి. నా కొలతలు తీసుకుంటానని చెప్పి శరీరం మొత్తం అసభ్యంగా తాకాడు. ఆ వయసులో ఆ సంఘటనల గురించి మా అమ్మతో చెప్పే ధైర్యం నాకు లేదు అని నీనా తన పుస్తకంలో రాసుకొచ్చింది. 

Also Read: మళ్ళీ డుమ్మా కొట్టిన జాక్వెలిన్..ఈడీతోనే గేమ్స్, రూ.200 కోట్ల స్కామ్ కేసులో అంత ధైర్యం ఏంటి!

నీనా గుప్తా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం Viv Richards ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. అతడితో పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివాహం చేసుకోకుండానే రిచర్డ్స్, నీనా గుప్తా స్నేహితులుగా మిగిలిపోయారు. మాసాబ గుప్తా వీరిద్దరి కుమార్తె. పెళ్లి కాకుండానే తల్లి అయినప్పుడు లోకం నుంచి ఎన్నో నిందలు భరించానని గతంలో నీనా ఎమోషనల్ గా రివీల్ చేసింది. నీనా గుప్తా సెకండ్ ఇన్నింగ్స్ లో 'బదాయి హో' లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్