'హలో గురు ప్రేమకోసమే' డే-2 షాకింగ్ కలెక్షన్స్!

By Udayavani DhuliFirst Published Oct 20, 2018, 12:37 PM IST
Highlights

రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏవరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమా టాక్ కి కలెక్షన్స్ కి పొత్తు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏవరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమా టాక్ కి కలెక్షన్స్ కి పొత్తు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తొలిరోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.3.98 కోట్లను వసూలు చేసింది. రామ్ కెరీర్ లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్. ఇక రెండో రోజు వసూళ్లు మొదటిరోజుకి మించిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సినిమా రెండో రోజు రూ.4.02 కోట్ల వసూళ్లను రాబట్టింది. దసరా సెలవు దినం కావడంతో సినిమాకి బాగా కలిసొచ్చింది. 

రెండు రోజుల్లో రామ్ సినిమా ఇన్ని కోట్లు వసూలు చేయడం మాములు విషయం కాదు. నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఈ సినిమా సత్తా చాటుతోంది. మరో రెండు రోజుల పాటు ఈ సినిమా జోరు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇదే రేంజ్ లో కలెక్షన్లు వసూలు అయితే గనుక డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు లాభాల బాట పట్టడం ఖాయం. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్లు..(2వ రోజు)
నైజాం....................1.68 కోట్లు 
క్జ్రిష్ణ.........................24 లక్షలు 
సీడెడ్......................66 లక్షలు 
ఈస్ట్...........................26 లక్షలు 
వెస్ట్.............................12 లక్షలు 
నెల్లూరు.....................13 లక్షలు 
ఉత్తరాంధ్ర.................55 లక్షలు 
గుంటూరు...................38 లక్షలు 

మొత్తంగా రెండో రోజుల సినిమా కలెక్షన్లు.. రూ.4.02 కోట్లు.. ఫస్ట్ డే, సెకండ్ డే వసూళ్లు కలిపి సినిమా ఇప్పటివరకు రూ.8 కోట్లు వసూలు చేయడం విశేషం. 

ఇవి కూడా చదవండి.. 

'హలో గురు ప్రేమకోసమే' ఫస్ట్ డే కలెక్షన్స్!

రివ్యూ: హలో గురు ప్రేమకోసమే

ప్రీమియర్ షో టాక్: హలో గురు ప్రేమ కోసమే

మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)

 

click me!