RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

Published : Oct 20, 2018, 12:03 PM IST
RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

సారాంశం

టాలీవుడ్ లో 100 కోట్ల బిజినెస్ అనేది ఇప్పుడు మాములు మాటగా మారింది. ఒకప్పుడు 50 కోట్ల గ్రస్స్ అందింది అంటేనే అది ఒక సెన్సేషన్. కానీ మన స్టార్ హీరోల క్రేజ్ సినిమా సినిమాకు ఎంతగా పెరుగుతుందో కలెక్షన్స్ ను చుస్తే అర్ధమవుతోంది.

టాలీవుడ్ లో 100 కోట్ల బిజినెస్ అనేది ఇప్పుడు మాములు మాటగా మారింది. ఒకప్పుడు 50 కోట్ల గ్రస్స్ అందింది అంటేనే అది ఒక సెన్సేషన్. కానీ మన స్టార్ హీరోల క్రేజ్ సినిమా సినిమాకు ఎంతగా పెరుగుతుందో కలెక్షన్స్ ను చుస్తే అర్ధమవుతోంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొందరు హీరోలు వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. 

అసలు విషయంలోకి వస్తే.. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ RRR పై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్  ప్రధాన పాత్రల్లో తెరక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే బిజినెస్ లు మొదలయ్యాయి. 

బాహుబలి చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ 100 కోట్లకు తెలుగు హక్కులను కొనుగోలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాను మూడు భాషల్లో తెరక్కించనున్నట్లు తెలుస్తోంది. హిందీ - తమిళ్ లో కూడా సినిమాకు మంచి రేట్ దక్కే అవకాశం ఉంది. అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమో గాని సినిమా బడ్జెట్ ను బట్టి మినిమమ్ 400కోట్ల బిజినెస్ చేస్తేనే పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చినట్లు. 

నిర్మాత డివివి.దానయ్య ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇక రాజమౌళి 2019 జనవరిలో షూటింగ్ ను మొదలుపెట్టి 2020 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు