హరితేజ ఆ షోకి గ్లామర్ తేగలదా?

Published : Oct 12, 2017, 05:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
హరితేజ ఆ షోకి గ్లామర్ తేగలదా?

సారాంశం

బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న  హరితేజ యాంకర్ గా అవకాశాలు అందుకుంటున్న హరితేజ జబర్దస్త్ షోకి యాంకర్ గా హరితేజను ఎంచుకున్నట్లు సమాచారం.

తెలుగు నాట బిగ్ బాస్ షో హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ షోతో తర్వాత అందరి సంగతేమో తెలీదు కానీ.. హరితేజ కు మాత్రం ఆఫర్లు క్యూలుకుడతున్నాయట. గతంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన హరితేజకు ఇప్పుడు యాంకర్ గా నటించే అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

 

బిగ్ బాస్ షోలో మొదటి వారం నుంచి చివరి వారం వరకు ఎంతో హుషారుగా పాల్గొని.. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది హరితేజ. దీంతో ఆమెకు మల్లెమాల ప్రొడక్షన్ నిర్వహిస్తున్న జబర్దస్త్‌ షో లో యాంకర్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ షో  ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువ కాబట్టి.. హరితేజ కూడా వెంటనే ఒప్పుకుందని టాక్. ఈ షోకి ఇప్పటికే అనసూయ, రష్మీలు యాంకర్లుగా చేస్తున్నారు. అయితే రష్మీ స్థానంలో హరితేజని తీసుకుంటున్నారట.

 

ఇదిలా ఉంటే రష్మీనే స్వయంగా ఈ షో నుంచి తప్పుకుందనే వార్తలు కూడా వినపడుతున్నాయి.  రష్మీకి బిగ్ బాస్‌ సీజన్‌2లో అవకాశం వచ్చిందని అందుకే ఆమె తప్పుకుందని సమాచారం. దీంతో మల్లెమాల ప్రొడక్షన్స్ హరితేజను సంప్రదించారట. ఏది ఏమైనా బిగ్ బాస్ షో మాత్రం హరితేజకు బాగానే అవకాశాలు తెచ్చిపెడుతోంది.

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్