సమంత చైతూలను సర్ ప్రైజ్ చేసిన పవన్ త్రివిక్రమ్

Published : Oct 12, 2017, 03:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సమంత చైతూలను సర్ ప్రైజ్ చేసిన పవన్ త్రివిక్రమ్

సారాంశం

ఇటీవలే సమంత, నాగచచైతన్యల వివాహం అక్కినేనిగా ఇంటి పేరు మార్చుకున్న సమంత సమంత,చైతూల పెళ్లికి డైమండ్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చిన పవన్,త్రివిక్రమ్

టాలీవుడ్ హాట్ లవర్స్ సమంత, నాగచైతన్య  ఈ అక్టోబర్ 6న వివాహంతో ఒక్కటయ్యారు. వారం పది రోజులుగా అంతటా ఈ పెళ్లి గురించిన వార్తలే. కుటుంబ సభ్యులు, సన్నిహతుల మధ్య వీరిద్దరూ అక్టోబర్ 6న గోవాలో పెళ్లాడారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహమైంది.

 

పెళ్లి కానుకగా సామ్-చై దంపతులకు పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఊహించని రీతిలో గిఫ్ట్‌ను పంపారట. కొత్త జంట కోసం రెండు డైమండ్ రింగ్‌లను వీరు బహుమతిగా పంపించారట. ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.



హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్లో పాల్గొని కొత్త జంటకు ఉంగరాలు ఇవ్వాలని పవన్, త్రివిక్రమ్ ముందుగా భావించారట. కానీ ప్లాన్ మార్చుకొని పెళ్లి సమయంలో నూతన దంపతులకు ఈ గిఫ్ట్‌ను పంపి సర్‌ప్రైజ్ చేశారట. అయితే ఈ వార్తల పట్ల అటు చైతూ సమంతలు గానీ, ఇటు పవన్, త్రివిక్రమ్ గానీ స్పందించలేదు. పవర్ స్టార్ సరసన సమంత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించారు.

PREV
click me!

Recommended Stories

ఒకవైపు స్నేహితుడు, మరోవైపు దళపతి విజయ్ తండ్రి.. ఇద్దరి కోసం కథ కూడా వినకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు
Vijay Controversy: అంత సీన్ లేదా.. దళపతి విజయ్‌కి హీరోయిన్‌ క్రేజీ కౌంటర్‌