నిహారిక, సాయి ధరమ్ తేజ్ ల పెళ్లిపై నాగబాబు క్లారిటీ

Published : Sep 19, 2017, 03:38 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
నిహారిక, సాయి ధరమ్ తేజ్ ల  పెళ్లిపై  నాగబాబు క్లారిటీ

సారాంశం

నిహారిక, సాయి ధరమ్ తేజ్ ల పెళ్లిపై రూమర్లు రూమర్లు కొట్టిపారేసిన నాగబాబు అదొక ఫూలిష్ న్యూస్ అని తేల్చిన నాగబాబు

మెగా ఫ్లామిలీపై సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. వాటికి తమదైన శైలిలో మెగా కుటుంబ సభ్యులు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే మెగా బ్రదర్, టవర్ స్టార్ నాగబాబు గారాలపట్టి నిహారిక, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లు వివాహం చేసుకోబోతున్నారని.

 

గత కొంతకాలంగా వస్తున్న ఈ రూమర్లపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అదోక ఫూలిష్ న్యూస్ అని తేల్చేశారు. ఎవరో పనీపాట లేని దరిధ్రుడు క్రియేట్ చేశాడని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారిక, సాయిధరమ్ తేజ్ లు చిన్నప్పటి నుంచి అన్నాచెల్లెలుగా పెరిగారని చెప్పారు. కొందరు పనీపాట లేని వాళ్లు అలాంటి వార్తలు రాస్తారని.. మమ్మల్ని అడిగి రాయాలనే బుద్ధి కూడా వారికి ఉండదని నాగబాబు అన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన చెప్పారు.

 

సాయిధరమ్ తేజ్.. మెగా వారసుడిగా సినీ ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు. తన దైన శైలిలో కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. మెగా డాటర్ నిహారిక కూడా ఇటీవల ఒక తెలుగు సినిమాలో నటించింది. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు..ప్రస్తుతం ఆమె తమిళంలో సినిమా  చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?