
టాలీవుడ్ నటి హంసానందిని తాను క్యాన్సర్ వ్యాధికి గురై చికిత్స పొందుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీనితో సినీ అభిమానులంతా షాక్ కి గురయ్యారు. టాలీవుడ్ లో హంస నందిని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. అలాంటి హంసానందిని క్యాన్సర్ బారిన పడిందంటే షాక్ కి గురయ్యే అంశమే.
బ్రెస్ట్ క్యాన్సర్ కి గురైన హంసానందిని ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతోంది. అందుకే ఆమె గుండుతో కనిపిస్తోంది. ఈ వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ హంసా నందిని త్వరగా కోలుకోవాలని, తిరిగి మరింత స్ట్రాంగ్ గా రావాలని పోస్ట్ లు పెట్టారు.
నేను త్వరగా కోలుకోవాలని ఆశించిన, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు. మీ హద్దుల్లేని ప్రేమాభిమానాలు మాటల్లో వర్ణించలేనివి. ఇంతటి అభిమానం పొందినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మీ నన్ను మరింత స్ట్రాంగ్ గా మార్చారు. అభిమానులకు, స్నేహితులకు, ఫ్యామిలీకి హంసానందిని కృతజ్ఞతలు తెలిపింది.
గతంలో చాలా మంది సెలెబ్రిటీలు క్యాన్సర్ వ్యాధికి గురై కోలుకున్నారు. హంసా నందిని కూడా తిరిగి పూర్తి ఆరోగ్యంగా మారుతుందని అభిమానులు కోరుకుంటున్నారు.
మిర్చి, లౌక్యం, అత్తారింటికి దారేది , లెజెండ్ లాంటి చిత్రాల్లో హంసానందిని స్పెషల్ సాంగ్స్ చేసింది. ఈగ , బెంగాల్ టైగర్, జైలవకుశ చిత్రాల్లో నటించింది.
Also Read: 'వకీల్ సాబ్' అనన్య బోల్డ్ షో.. షర్ట్ ఓపెన్ చేసి మరీ, కిల్లర్ లేడి తరహాలో ఫోజులు