
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో థియేటర్స్ లో అమలవుతున్న టికెట్స్ ధరలు సవరిస్తూ కొత్త జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం టికెట్స్ ధరలు కొంత మేర పెంచడం జరిగింది. విభాగాల వారీగా టికెట్స్ ధరల నూతన పట్టిక విడుదల చేశారు. దీని ప్రకారం... మినిమమ్ రూ. 30 మాక్సిమమ్ రూ. 300 లుగా టికెట్స్ ధరలు నిర్ణయించారు. ఈ ధరలకు అదనంగా ప్రేక్షకులు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 3 నుండి 5 వరకు థియేటర్స్ మైంటెనెన్సు కాస్ట్ అదనంగా ప్రేక్షకులు చెల్లించాలి.
సవరించిన టికెట్స్ ధరల పకారం.. నాన్ ఏసీ థియేటర్స్ లో టికెట్ ధర మినిమమ్ రూ. 30 కాగా మాక్సిమమ్ రూ. 70. ఇక ఏసీ థియేటర్స్ లో మినిమమ్ 50- మాక్సిమమ్ రూ. 150గా నిర్ణయించారు. ఫుష్ బ్యాక్ సీట్స్ కలిగిన సింగిల్ థియేటర్స్ టికెట్ ధర రూ. 200. ఐమాక్స్, 75 ఫీట్స్ స్క్రీన్స్ థియేటర్స్ లో రూ. 250. ఇక ముల్టీ ఫ్లెక్స్ లలో రూ. 250-300 గా నిర్ణయించారు. ఈ ధరలకు జీఎస్టీ అధికం.
సినిమా పరిశ్రమ మనుగడ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవపై చిరంజీవి స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణా సీఎం, ప్రభుత్వ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ''తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికి న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది'' అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో ''పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్నచీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి, మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారికి, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్స్ వైరల్ గా మారాయి.
Also read RRR Movie: ఆర్ ఆర్ ఆర్ కి ఊహించని షాక్... వసూళ్లపై తీవ్ర ప్రభావం
మరోవైపు ఏపీలో టికెట్స్ ధరలు విషయంలో సందిగ్ధత కొనసాగుతుందడగా చిరంజీవి ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్స్ నిర్వహణ సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ (RRR movie)వంటి చిత్రానికి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రాణ సంకటమే.
Also readRoundup 2021: పవన్ ప్రసంగం, మా ఎన్నికలు, సమంత విడాకులు... 2021లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు
అధికారులు ఓ వైపు ప్రమాణాలు పాటించని థియేటర్స్ సీజ్ చేస్తున్నారు. అధికారుల తనిఖీలకు బయపడి కొందరు యజమానులు స్వచ్ఛందంగా హాళ్లు మూసి వేసుకుంటున్నారు. దీని వలన విడుదలకు అందుబాటులో ఉన్న థియేటర్స్ సంఖ్య తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసిన మల్టీ స్టారర్ ఆచార్య (Acharya)ఫిబ్రవరి ఫిబ్రవరి 4న విడుదల కానుంది. అప్పటికైనా టికెట్స్ ధరల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సైతం ఈ విషయంపై స్పందించారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్... పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని గుర్తుచేస్తూ టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.