ఊహించని విధంగా అజయ్ భూపతి..మహాసముద్రం సినిమాని డైరక్ట్ చేసారు. అది డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్టు ఏ హీరోతో చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.
ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా బోల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా అనుకోని విజయాన్ని సాధించింది. యూత్ కి బాగా ఇంట్రస్ట్ కలిగించిన ఈ సినిమాతో హీరోకి, హీరోయిన్ కి, దర్శకుడికి కూడా మంచి పేరొచ్చింది. కార్తికేయ హీరోగా పాయల్ రాజపుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా హిట్ తర్వాత అజయ్ భూపతికి మంచి మంచి ఛాన్స్ లు వచ్చాయని. అసలు బాలీవుడ్ కి వెళ్ళిపోతున్నాడనే ప్రచారం మాములుగా జరగలేదు. అయితే ఊహించని విధంగా అజయ్ భూపతి..మహాసముద్రం సినిమాని డైరక్ట్ చేసారు. అది డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్టు ఏ హీరోతో చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.
మహా సముద్రం సినిమా రిలీజ్ ముందు దాకా ...నితిన్, రామ్ లైతే అజయ్ భూపతిని పిలిచి అవకాశమిచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే నితిన్, రామ్ లు అజయ్ ని కలిసిన మాట వాస్తవమేనట. అలాగే అజయ్ పెళ్లికి నితిన్ తో పాటుగా రామ్ కూడా హాజరయ్యేసరికి వారి కాంబోలో మూవీ ఫిక్స్ అన్నట్లుగా మాట్లాడుకున్నారు. అయితే అవన్నీ సినిమా రిలీజ్ తర్వాత ప్రక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు తాజాగా అజయ్ భూపతి ఓ యంగ్ హీరోతో సినిమా చెయ్యబోతున్నాడు. అతనెవరో కాదు... RX100 తో హీరోగా నిలదొక్కుకుని, తమిళంలో సైతం మార్కెట్ తెచ్చుకున్న కార్తికేయ. ఓ పెద్ద బ్యానర్ లో అజయ్ భూపతి సినిమా చెయ్యబోతున్నారు. ఇప్పటికే కథ లాక్ అయ్యిందని సమాచారం.
వాస్తవానికి కార్తికేయ ..RX100 తర్వాత వరస సినిమాలు చేసాడు. కానీ ఏదీ వర్కవుట్ కేలేదు. ఈ నేపధ్యంలో తమ కాంబినేషన్ కు ఖచ్చితంగా క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఓ లవ్ స్టోరీని డైరక్ట్ చేస్తున్నారట అజయ్ భూపతి. 2022 లో సినిమా ప్రారంభం కానుంది.
ఇక కార్తికేయ కెరీర్ విషయానికి వస్తే...ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా కార్తికేయ విలనిజం సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమా విలన్ పాత్ర వెతుక్కుంటూ మరీ వచ్చింది. సిహెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న వాలిమై సినిమాలో అజిత్ కు పోటీగా నటిస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా షూటింగ్ పూర్తై సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. తెలుగులో హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా డిజాస్టర్ అవటంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.