
ఇక ఇందులో నటించే నటీనటులపై ప్రేక్షకులు మంచి అభిమానం పెంచుకున్నారు. అందులో హీరో రిషి మాత్రం తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు. అయితే రిషి అసలు పేరు ముఖేష్ గౌడ. ఇతడు కర్ణాటక మైసూర్ లోని జన్మించాడు. ఇక అక్కడే తన విద్యను పూర్తి చేశాడు. మోడలింగ్ చేసి మిస్టర్ కర్ణాటక టైటిల్ అందుకున్నాడు. నటన మీద ఆసక్తి ఉండటంతో 2017లో కన్నడలో నాగ కన్యకే అనే సీరియల్ తో అడుగుపెట్టాడు. ఈ సీరియల్ అక్కడ బాగా పాపులర్ అయింది.
ఆ తర్వాత ముఖేష్ తెలుగులో ప్రేమనగర్ సీరియల్ తో పరిచయమయ్యాడు. ఇక ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటించగా ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ముఖేష్ తల్లిదండ్రులు విషయానికి వస్తే అతని తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తల్లి హౌస్ వైఫ్. ఇక అతడికి అక్క కూడా ఉంది. ముఖేష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.
అందులో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటాడు. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని.. ఇక తనకు కార్తీకదీపం, దేవత సీరియల్స్ అంటే బాగా నచ్చుతాయి అని గతంలో తెలిపాడు. ఇక ముఖేష్ బుల్లితెరపై ఏదైనా షో లలో పాల్గొంటే తన వ్యక్తిగత విషయాలు బాగా పంచుకుంటూ ఉంటాడు. గతంలో తన తండ్రి గురించి చాలా విషయాలు పంచుకొని ఎమోషనల్ అయ్యాడు.
తన తండ్రి అంటే చాలా ఇష్టమని.. ఆయన సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని తెలిపాడు. ఇక తన తండ్రి పక్షవాతంతో కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తానే చూసుకున్నాను అని బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇక తన తండ్రికి కొడుకుగా పుట్టినందుకు సంతోషంగా ఉంది అంటూ ఆనందంగా తెలిపాడు. ఇక ఇదంతా పక్కన పెడతాం ముఖేష్ ఎటువంటి గర్వం చూపించకుండా ఫాన్స్ తో బాగా మూవ్ అవుతూ ఉంటాడు.