శివ ఆరాధనలో సమంత.. ‘భగవంతుని ఆశీస్సులు కలగాలం’టూ సామ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

By Asianet News  |  First Published Feb 18, 2023, 11:48 AM IST

మహాశివరాత్రి సందర్భంగా టాలీవుడ్  స్టార్ హీరోయిన్ సమంత (Samantha) శివ ఆరాధనలో మునిగిపోయాయి. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. తాజాగా సామ్ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.
 


మహాశివరాత్రి (Maha Shivarathri 2023) సందర్భంగా దేశ వ్యాప్తంగా భోళా శంకరుడికి భక్తజనం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ఆలయాలను దర్శిస్తూ.. శివుడి దర్శనం చేసుకుంటున్నారు. సినీ తారలు కూడా శివపూజలో భాగం అవుతున్నారు. తాజాగా టాలీవుడ్  స్టార్ హీరోయిన్ సమంత శివ ఆరాధనలో మునిగిపోయాయి. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సామ్ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.

తాజా పోస్టులో సామ్ ఈప్రత్యేకమైన రోజున శిడుడిని ఆరాధిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తెల్లటి వస్త్రాలతో శివుడిని నమస్కరిస్తున్నట్టుగా.. ఆదిగురువు ధ్యనిస్తున్నట్టుగా ఓ ఫోటోను షేర్ చేశారు ‘ఓం నమః శివాయ!, భగవంతుని ఆశీస్సులు కలగాలి, శివుడు జీవితాంతం మీతోనే ఉంటాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా సామ్ కు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శివభక్తిని చాటుకోవడంతో ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. 

Latest Videos

స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సమంత ఇటీవల  హిందూ దేవుళ్లను ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. చైతూతో విడిపోయిన తర్వాత సమంత దేశవ్యాప్తంగా ఆయా దేవాలయాలనూ కూడా సందర్శించారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని ప్రశాంతతను పొందుతున్నారు. ఇక రీసెంట్ గా తను మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తనకు కాస్తా నయం కావడంతో.. తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించి మొక్కు తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 600 మెట్లు ఎక్కుతూ.. మెట్టు మెట్టుకు దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగిపోయాిరు. 

తన ఆరోగ్యం కుదుట పడుతుండటంతో సమంత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్ పైనా ఫోకస్ పెట్టారు. బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్నారు సమంత. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇక ఈ మహాశివరాత్రికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి న ‘శాకుంతలం’ మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’చిత్ర షూటింగ్ లో సమంత మరికొద్దిరోజుల్లో జయిన్ కానున్నారని తెలుస్తోంది. 

 

click me!