మెగా దుమారం రేపిన చిరంజీవి ట్వీట్.. మగధీర, ఆచార్య చిత్రాలు తెరపైకి.. ఇంత వివాదం అవసరమా

Published : Feb 18, 2023, 12:15 PM IST
మెగా దుమారం రేపిన చిరంజీవి ట్వీట్.. మగధీర, ఆచార్య చిత్రాలు తెరపైకి.. ఇంత వివాదం అవసరమా

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ లోకల్ గా అభిమానులు మాత్రం ఫ్యాన్ వార్స్ దగ్గరే ఆగిపోయారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ లోకల్ గా అభిమానులు మాత్రం ఫ్యాన్ వార్స్ దగ్గరే ఆగిపోయారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ కి చేరువలో ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు ఊహించినవే. కానీ రోజు రోజుకి అవి తారా స్థాయికి చేరుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ గొప్ప అని మెగా ఫ్యాన్స్ అంటుంటే.. కాదు ఎన్టీఆర్ నటన మహాద్భుతం అని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతూ రాంచరణ్ గురించి ట్వీట్ చేశారు. ఇటీవల రాజమౌళి.. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లెజెండ్రీ డైరెక్టర్స్ ని కలిశారు. వారు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి అనేక విషయాలు చర్చించారు. జేమ్స్ కామెరూన్ అయితే తాను తన భార్యతో కలసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రెండు సార్లు చూశానని చెబుతూ జక్కన్నని ప్రశంసలతో ముంచెత్తాడు. 

కామెరూన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. తనకు ఆర్ఆర్ఆర్ రామ్ పాత్ర ఎంతగానో నచ్చింది అని ప్రశంసలు కురిపించారు.  రామ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రామ్ పాత్ర ఏంటో పూర్తిగా అర్థం అయిన తర్వాత హృదయం బరువెక్కే విధంగా ఉంటుంది అంటూ కామెరూన్ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు తన కొడుకు గురించి చెప్పడంతో చిరంజీవి కూడా పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఈ వీడియో ట్విటర్ లో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. గ్లోబల్ ఐకాన్ జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడుకి రామ్ పాత్ర బాగా నచ్చింది అంటే.. అది ఆస్కార్ అవార్డుకు ఏమాత్రం తక్కువ కాదు. రాంచరణ్ కి ఇది గొప్ప గౌరవం. రాంచరణ్ ని చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఇక్కడే సోషల్ మీడియాలో వివాదం మొదలయింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ మాత్రమే నటించలేదు.. ఎన్టీఆర్ కూడా గొప్పగా నటించాడు. రాజమౌళి కష్టం ఎంతైనా ఉంది. ఇవన్నీ చెప్పకుండా తన కొడుకు గురించి మాత్రం ట్వీట్ వేసుకోవడం ఏంటి అంటూ నందమూరి ఫ్యాన్స్ మండి పడుతున్నారు. 

మగధీర సమయంలో కూడా ఇలాగే జరిగింది అంటూ పాత విషయాలు తెరపైకి తీసుకువస్తున్నారు. మగధీర చరణ్ వల్లే హిట్ అయింది అంటూ మెగా క్యాంప్ ప్రచారం చేసుకుంది అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆచార్య డిజాస్టర్ అయితే మాత్రం ఆ నెపం దర్శకుడి మీదికి నెట్టేశారు అని అంటున్నారు. 

మెగా అభిమానులు కూడా కౌంటర్ గా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండ్రీ దర్శకుడు మెచ్చుకుంటే ఏ తండ్రికి అయినా సంతోషం కలగడం సహజమే. దీనికి ఎందుకు ఇంత గొడవ అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో తాను రెండు మార్కులు చరణ్ పాత్రకే వేస్తానని చెప్పిన విషయాన్ని మెగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ ముంగిట ఉంటే ఇలాంటి అనవసర వివాదాలు ఎందుకు అంటూ కామన్ ఆడియన్స్ విమర్శిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్