Anushka shetty: ప్రభాస్ హోమ్ బ్యానర్ లో అనుష్క న్యూ ఏజ్ ఎంటర్టైనర్

Published : Nov 07, 2021, 12:34 PM IST
Anushka shetty: ప్రభాస్ హోమ్ బ్యానర్ లో అనుష్క న్యూ ఏజ్ ఎంటర్టైనర్

సారాంశం

ఎట్టకేలకు తన ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ఆమె కొత్త మూవీ ప్రకటన చేశారు. ప్రభాస్ (Prabhas) హోమ్ బ్యానర్ లో అనుష్క ఓ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

హీరోల రేంజ్ ఫాలోయింగ్, ఇమేజ్ అనుష్క (Anushka shetty) సొంతం. అంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎడా పెడా సినిమాలు చేయరు అనుష్క. బాహుబలి సిరీస్ తరువాత ఆమె సినిమాల జోరు తగ్గించారు. ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. 2017లో బాహుబలి 2 విడుదల కాగా, ఆ తర్వాత 2018లో భాగమతి, 2020లో నిశ్శబ్దం మూవీ విడుదల చేశారు. అంటే మూడున్నరేళ్ల కాలంలో అనుష్క చేసింది, రెండు పూర్తి స్థాయి చిత్రాలు మాత్రమే. 


ఎట్టకేలకు తన ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ఆమె కొత్త మూవీ ప్రకటన చేశారు. ప్రభాస్ (Prabhas) హోమ్ బ్యానర్ లో అనుష్క ఓ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అనుష్క 48వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మూడవ చిత్రం. ప్రభాస్-అనుష్క కాంబినేషన్ లో విడుదలైన మిర్చి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. 


అనంతరం భాగమతి చిత్రం కూడా అదే బ్యానర్ లో నిర్మితమై మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా హ్యాట్రిక్ హిట్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఇక దర్శకుడు మహేష్ బాబు పి, ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నేడు 40వ బర్త్ డే (Birthday) జరుపుకుంటున్న అనుష్కకు బర్త్ డే విషెష్ తెలియజేసిన యూవీ క్రియేషన్స్, ప్రత్యేక వీడియో ద్వారా కొత్త మూవీ ప్రకటన చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. 

Also read Anushka shetty: అసలు నటి కావాలని అనుకోని అనుష్క... బర్త్ డే సందర్భంగా మీకు తెలియని ఇంట్రెస్టింగ్ డిటైల్స్
అరుంధతి, బాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన అనుష్క నుండి రానున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి. అది కూడా హిట్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో గ్యారంటీ హిట్ అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగాఅనుష్కకకు బర్త్ డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి. చిత్ర ప్రముఖులు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. మరి నలభై ఏళ్ళు వచ్చిన అనుష్క పెళ్లిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోనున్నారంటూ చాలా కాలం పుకార్లు చక్కర్లు కొట్టాయి. 

Also read Bheemla Nayak: 'లాలా భీమ్లా' సాంగ్.. పూనకాలు తెప్పించే బీట్, ఇదిగో లిరికల్ వీడియో

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు