NTR: సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చిన ఎన్టీఆర్.. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొదటిసారి!

Published : Nov 15, 2021, 01:34 PM ISTUpdated : Nov 15, 2021, 01:39 PM IST
NTR: సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చిన ఎన్టీఆర్.. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొదటిసారి!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం అవుతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు. సామాన్యులను కోటీశ్వరులుగా మార్చేస్తాం అంటున్న ఎన్టీఆర్ షోలో నిజంగానే ఓ కంటెస్టెంట్ కోటీ గెలుచుకున్నారు. 

నాగార్జున హోస్ట్ గా మా టీవీలో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షో, పేరు మార్చి జెమినీలో ప్రసారం చేస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు(Evaru Meelo Koteeswarulu) పేరుతో ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షోకి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కథలు మీవి, కలలు మీవి, ఆట నాది, కోటి మీది.. అంటూ ఎన్టీఆర్ తన వాక్ చాతుర్యం తో మెప్పిస్తున్నారు. మనీతో పాటు మనసులు కూడా గెల్చుకోవచ్చని ఎన్టీఆర్ చెబుతుండగా ... ఈ షోలో అద్భుతం ఆవిష్కృతం అయినట్లు తెలుస్తుంది. 


మొదటిసారి ఓ కంటెస్టెంట్ చివరి వరకు ఆడి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పాడట. దీనితో షో హైయెస్ట్ ప్రైజ్ మనీగా ఉన్న రూ. కోటి గెలుచుకున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయం తెలియజేశారు ప్రోమోలో కోటి గెలుచుకున్న వ్యక్తిని మాత్రం రివీల్ చేయలేదు. అయితే బయట ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం...  తెలంగాణాకు చెందిన ఓ పోలీస్ అధికారి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి రూపాయలు గెలుచుకున్నారని తెలుస్తుంది. 


త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ పై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. ఇక బుల్లితెర హోస్ట్ గా ఎన్టీఆర్ (NTR) కి ఇది రెండవ ప్రోగ్రాం. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా ఉన్న ఎన్టీఆర్, రికార్డు టీఆర్పీ రాబట్టి, సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎవరు మీలో కోటీశ్వరులు మాత్రం ఆ స్థాయిలో టీఆర్పీ రాబట్టలేకపోతుందని సమాచారం. ఈ షో టీఆర్పీ ఆశించిన దానికి చాలా దూరంలో ఉందట. ఓవర్ ఆల్ ఛానల్ టీఆర్పీ పరంగా కూడా జెమినీ వెనకబడిపోయింది. స్టార్ మా, ఈటీవి ఈ విషయంలో సక్సెస్ ప్రోగ్రామ్స్, సీరియల్స్ తో దూసుకుపోతున్నాయి. 

Also read RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మాస్ సాంగ్‌.. ‘నాటు’ కాపీయా... ?

మరోవైపు ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ (RRR movie) విడుదల సిద్ధం అవుతుంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ (Ram charan) అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. 

Also read ఎన్టీఆర్ నాతో ఆ మాట అన్నారు.. పునీత్ మరణం తర్వాత తొలిసారి శివరాజ్ కుమార్..

PREV
click me!

Recommended Stories

Raasi: `నిజం` విషయంలో రియలైజ్‌ అయిన రాశి, ఆడియెన్స్ కి సారీ.. పాపం ప్రతాప్‌ మూవీపై షాకింగ్‌ కామెంట్‌
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్