బాలకృష్ణ (Balakrishna) చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని భారీగా సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. కాగా బాలయ్య కు విలన్ గా కన్నడ హీరోను దించుతున్నారు.
అఖండ (Akhanda) మూవీతో బాలయ్య, క్రాక్ చిత్రంతో దర్శకుడు గోపీచంద్ మలినేని ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. ఇద్దరూ తమ తమ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. క్రాక్ మూవీ పిచ్చ పిచ్చగా నచ్చడంతో బాలయ్య ఇంటికి పిలిచి మరీ గోపీచంద్ కి అవకాశం ఇచ్చారు. ఆ జోష్ లో బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు మంచి దమ్మున్న స్క్రిప్ట్ గోపిచంద్ సిద్ధం చేసినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ రానుందని ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.
మరి బాలయ్యకు విలన్ అంటే సామాన్య విషయం కాదు. ఆయన ఎనర్జీని తట్టుకోవాలంటే సాదా సీదా విలన్స్ సరిపోరు. ఈ విషయం బాగా తెలిసిన గోపిచంద్ ఏకంగా కన్నడ హీరోని రంగంలోకి దించారు. అక్కడ మాస్ హీరోగా కొనసాగుతున్న దునియా విజయ్ (Duniya Vijay) ని విలన్ గా ఎంపిక చేశారు. దీనిపై నుండి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. విలన్ గా దునియా విజయ్ ఎంట్రీ సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టింది. లేటెస్ట్ అప్డేట్ బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది.
బాలయ్య 107 (NBK 107) వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య ఈ మూవీలో దుమ్ము రేపనున్నారని సమాచారం. గతంలో బాలయ్య పోలీస్ గా చేసిన రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి భారీ విజయాలు నమోదు చేశాయి. ఇక ఈ చిత్రానికి వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సంక్రాంతి కి పూజా కార్యక్రమాలు జరుపుకొని సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట.
ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా అఖండ (Akhanda) రన్ థియేటర్స్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రూ. 115 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించిన అఖండ సందడి థియేటర్స్ లో తగ్గలేదు. ఇంకా ఓ మోస్తరు వసూళ్లు ఈ చిత్రానికి దక్కుతున్నాయి. అఖండ మూవీతో బాలకృష్ణ సాలిడ్ కమ్ బ్యాక్ అయ్యారు.
ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకి రవితేజ, గోపిచంద్ మలినేని గెస్ట్స్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ టాక్ షోలో ఈ ముగ్గురి మధ్య అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. గోపీచంద్ అయితే నరసింహనాయుడు మూవీ కోసం పోలీస్ స్టేషన్ కి పోవాల్సి వచ్చిందని, పోలీసులు శాంపిల్ గా లాఠీతో ఒకటిచ్చారని చెప్పారు.
Also read Akhanda:'అఖండ' కు ఆంధ్రాలో కొత్త సమస్య, చర్చల్లో నిర్మాత?
కాగా ఈ షోలో మన నెక్స్ట్ మూవీ నుండి ఒక డైలాగ్ చెప్పు అన్నారు. ఇక బాలయ్య మూవీ కోసం గోపీచంద్ సిద్ధం చేసిన ఓ డైలాగ్ ఓ షోలో చెప్పారు గోపీచంద్. 'రోడ్డు మీదకు గొర్రో, జింకో వచ్చాయనుకో హారన్ వేస్తాం.. అదే సింహం వస్తే ఇంజిన్ ఆపి సైలెంట్ గా బండిలో కూర్చుంటాం... ఇక్కడ ఉంది సింహంరా రేయ్' అంటూ గోపిచంద్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కలిగించింది.
Also read బాలయ్య-గోపీచంద్ మూవీ డైలాగ్ లీక్... గూస్ బంప్స్ కలిగిస్తున్న పవర్ ఫుల్ డైలాగ్
Very happy to welcome the Sandalwood Sensation on board to 🎉😊
Redefines the Villainism with 👍🏻
NataSimham pic.twitter.com/x6mYe37rzu