శివపార్వతి థియేటర్‌ అగ్ని ప్రమాదంః మహేష్‌బాబు సినిమాని గుర్తు చేసుకుంటూ నాని ఎమోషనల్‌ ట్వీట్‌..

By Aithagoni RajuFirst Published Jan 3, 2022, 4:18 PM IST
Highlights

కూకట్‌పల్లిలోని శివ పార్వతి థియేటర్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ థియేటర్‌ అగ్నిప్రమాద ఘటనపై హీరో నాని స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు,.. ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 

హైదరాబాద్‌లోని ప్రముఖంగా నిలిచిన సినిమా థియేటర్లలో శివపార్వతి థియేటర్‌కి ప్రత్యేకమైన పేరుంది. ఎంతో చరిత్ర కూడా ఉంది. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు సైతం సినిమాలు చూశారు. ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నవారు, చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖులు ఎందరో ఇందులో సినిమాలు చూసిన వారే. అభిమాన హీరో చిత్రాలను ఫస్ట్ డే, ఫస్ట్ షోకి చూసిన వాళ్లే. అలాంటి ప్రాముఖ్యతని కలిగిన కూకట్‌పల్లిలోని ఈ థియేటర్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో కాలి బూడిదైంది. షార్ట్ సర్య్కూట్‌ కారణంగానే ఈ థియేటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా వెల్లడిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ థియేటర్‌ అగ్నిప్రమాద ఘటనపై హీరో నాని స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు,.. ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. `శివపార్వతి థియేటర్‌ అగ్ని ప్రమాద ఘటన వినడం చాలా బాధగా ఉంది.  అక్కడ `టక్కరి దొంగ` సినిమాని మొదటి రోజు ఎంతో పిచ్చి ఆనందంతో చూసినట్టు గుర్తు. ఈ ప్రమాద ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసి సంతోషిస్తున్నాను` అని వెల్లడించారు నాని. ఇదిలా ఉంటే ఇందులో ప్రస్తుతం నాని నటించిన `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రం ప్రదర్శించబడుతుంది.  అన్నట్టు `టక్కరి దొంగ` చిత్రంలో మహేష్‌బాబు హీరోగా నటించిన విషయం తెలిసిందే. 

Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt.

— Nani (@NameisNani)

నాని హీరోగా నటించిన `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రం క్రిస్మస్‌ కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. మిశ్రమ స్పందన లభించినా.. ఇప్పటికీ బాగానే రన్‌ అవుతుంది. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా, రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వం వహించారు. 1970టైమ్‌లో బెంగాల్‌ ప్రధానంగా సాగిన దేవదాసి వ్యవస్థపై శ్యామ్‌ సింగరాయ్‌ అనే రైటర్‌, ఉద్యమ కారుడు సాగించిన పోరాటం ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విమర్శకుల ప్రశంసలందుకుంటోందీ చిత్రం. 

also read: Hyderabad fire accident: కాలి బూడిదైన శివపార్వతి థియేటర్

click me!