హరికృష్ణ మృతిపై క్రిష్ ఎమోషనల్ పోస్ట్!

By Udayavani DhuliFirst Published Aug 29, 2018, 3:21 PM IST
Highlights

1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ ముందు హరికృష్ణ నడుస్తున్న ఫోటోని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తాజాగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ ముందు హరికృష్ణ నడుస్తున్న ఫోటోని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తాజాగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాల్యం నుండే ఆయన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల గురించి ఆలోచించేవారు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణకు దర్శకుడు క్రిష్ నివాళులు అర్పిస్తూ..

'మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారధ్యం. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నందమూరి హరికృష్ణ గారు 1962 జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్ గారి కంటే ముందే నడిచారు' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తున్నారు.

ప్రధాన పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కూడా ఉంటుందని సమాచారం. ఆ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం నుండి ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు.  

మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం
చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం garu leading NTR garu during the National Defence Fund activity in 1962.. pic.twitter.com/8LXvDP8Dzw

— Krish Jagarlamudi (@DirKrish)

 
ఇవి కూడా చదవండి.. 

‘‘ఆ దేవుడు..పదేపదే మిమ్మల్నే ఏడిపిస్తున్నారు..’’

నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని నెంబర్ సిరీస్!

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

click me!