‘‘ఆ దేవుడు..పదేపదే మిమ్మల్నే ఏడిపిస్తున్నారు..’’

Published : Aug 29, 2018, 02:52 PM ISTUpdated : Sep 09, 2018, 12:10 PM IST
‘‘ఆ దేవుడు..పదేపదే మిమ్మల్నే ఏడిపిస్తున్నారు..’’

సారాంశం

 ‘అన్నా.. నువ్వు అలా బాధపడితే.. మేము తట్టుకోలేము అన్నా’ అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ మృతితో నందమూరి అభిమానులంతా షాక్ కి గురయ్యారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కామినేని హాస్పిటల్ లో తండ్రి మృతదేహం చూసి.. అన్నదమ్ములు ఇద్దరూ బోరున విలపించారు. ఆ స్థితిలో వాళ్లని చూసిన అందరి గుండెలు బరువెక్కిపోయాయి. అయినప్పటికీ.. తమ బాధను గొంతులో దిగమింగుకొని.. అన్నదమ్ములు ఇద్దరూ జరగాల్సిన పనులను నిర్వర్తిస్తున్నారు.

దుఖంతో నిండిపోయిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఓదార్చేందుకు నందమూరి అభిమానులు ముందుకు వచ్చారు. నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంతాప సందేశాలు మెమ్స్ రూపంలో నెట్టింట షేర్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాధపడుతున్న ఫొటోలను ట్వీట్ చేస్తూ... ‘ఆ భగవంతుడికి కనికరం లేదన్నా.. పదే పదే మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా నాన్నకి ఏమైనా అయ్యింది అంటే నేను ఊహించలేను.. ఇలా మనిషిగా ఉండలేను’ అంటూ మరో మెమ్ ట్వీట్ చేశారు. నాన్నకు ప్రేమతో సీన్‌కు సంబంధించిన ఇమేజ్ ట్వీట్ చేస్తూ.... ఒక్కసారి ‘లే నాన్న’ అనే మెమ్ ట్వీట్ చేశారు. వీటిని చూస్తున్న మరికొంతమంది అభిమానులు ‘అన్నా.. నువ్వు అలా బాధపడితే.. మేము తట్టుకోలేము అన్నా’ అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?