'నర్తనశాల'పై హిజ్రాల ఫైర్.. రిలీజ్ ఆపమని డిమాండ్!

Published : Aug 29, 2018, 03:08 PM ISTUpdated : Sep 09, 2018, 01:50 PM IST
'నర్తనశాల'పై హిజ్రాల ఫైర్.. రిలీజ్ ఆపమని డిమాండ్!

సారాంశం

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలా వుండబోతుందనే విషయాన్ని టీజర్ లోనే చెప్పేసింది 

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలా వుండబోతుందనే విషయాన్ని టీజర్ లోనే చెప్పేసింది చిత్రబృందం. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమాపై నాగశౌర్య ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల కావడానికి వెళ్ళేదంటూ కొందరు హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని 'మా' అధ్యక్షుడు శివాజీరాజాని కలిసి హిజ్రాలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించేదే లేదని హెచ్చరించారు. సినిమాలో ఈ సన్నివేశాలు డిలీట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

అయితే రేపు విడుదల కాబోతున్న సినిమాను ఇప్పుడు ఆపడం కష్టమని వారికి వివరణ ఇచ్చిన శివాజీరాజా.. సినిమా విడుదలైన తరువాత అందులో అభ్యంతకరమైన సన్నివేశాలు ఏమైనా ఉంటే తెలియజేయమని అప్పుడు నిర్మాతలతో మాట్లాడి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?