దిల్ రాజు ఆఫర్ రిజెక్ట్ చేసిన రాఘవేంద్ర రావు.. బ్లాక్ బస్టర్ మూవీలో ఛాన్స్..

pratap reddy   | Asianet News
Published : Oct 11, 2021, 11:28 AM IST
దిల్ రాజు ఆఫర్ రిజెక్ట్ చేసిన రాఘవేంద్ర రావు.. బ్లాక్ బస్టర్ మూవీలో ఛాన్స్..

సారాంశం

పెళ్లి సందD  చిత్రంతో రాఘవేంద్ర రావు నటుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. వందకు పైగా చిత్రాలకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. రోషన్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది.  

అక్టోబర్ 15న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అతిథులుగా హాజరయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా అతిథిగా హాజరు కావడం విశేషం. 

Also read: చిరు మందు వేయాలంది ఎవరికీ... పవన్ కల్యాణే కేనా ఆ చురకలు!

పెళ్లి సందD  చిత్రంతో RaghavendraRao నటుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. వందకు పైగా చిత్రాలకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు. తొలిసారి  పెళ్లి సందD చిత్రంతో నటుడిగా మారారు. 

ఈ సందర్భంగా వేదికపై Dil Raju మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్ర రావు ఎందరో స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఏవీ చూస్తుంటే నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి. 

తమ బ్యానర్ లో రాఘవేంద్ర రావుతో సినిమా చేసే అవకాశమే నాకు దక్కలేదు. నేను ఇండస్ట్రీకి ఆలస్యంగా రావడం కూడా ఓ కారణం కావచ్చు. ఆయన్ని నటుడిగా పరిచయం చేసే అవకాశం కూడా కోల్పోయాను. శతమానం భవతి చిత్రంలో తాత పాత్ర కోసం మొదట రాఘవేంద్రరావుని అడిగాం. నటనంటే భయం అని ఆయన ఆ చిత్రాన్ని ఒప్పుకోలేదు. ఆ చిత్రంలో చేయకపోయినా ఇప్పుడు నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని దిల్ రాజు అన్నారు. శతమానం భవతి చిత్రంలో తాత పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఆ మూవీ అఖండ విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే