బ్రేకింగ్... మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా... టాలీవుడ్ కి నేను అతిథిగానే ఉంటాను

By team teluguFirst Published Oct 11, 2021, 11:27 AM IST
Highlights

మా ఎన్నికల ఫలితాల అనంతరం, మొదటిసారి ప్రకాష్ రాజ్ ప్రెస్ ముందుకు వచ్చారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు.


మా ఎన్నికల ఫలితాల అనంతరం, మొదటిసారి ప్రకాష్ రాజ్ ప్రెస్ ముందుకు వచ్చారు. వస్తూ వస్తూనే మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు.టాలీవుడ్ హీరోలతో, దర్శకులతో నిర్మాతలతో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ఈ పరిశ్రమతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. గెలిచిన మంచు విష్ణుకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఎన్నికలలో గెలుపు ఓటములు సాధ్యం. మా సభ్యులు కూడా నేను నాన్ లోకల్ అని భావిస్తున్నారు. అందుకే ఈ ఫలితం వచ్చింది. టాలీవుడ్ నన్ను బయటివాడిగా భావిస్తుంది. ఇకపై నేను కూడా అతిథిగానే ఉంటాను, అని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.  


నాకు ఓటు వేసిన వాళ్లకు ధన్యవాదాలు. బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశారు. జాతీయ స్థాయిలో దీన్ని విషయం చేశారు. మా ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు ప్రవేశించాయని ప్రకాష్ రాజ్ అన్నారు. మంచు విష్ణుపై గాని, ఆ ప్యానెల్ మెంబెర్స్ పై కానీ, Prakash raj నెగిటివ్ కామెంట్ చేయలేదు. అయితే మా సభ్యులు కేవలం ప్రాంతీయవాదం ఆధారంగా తనను ఓడించడం బాధపెట్టింది అన్నారు. ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్ లో ఉండలేను.నేను అబద్దాలు చెప్పలేను. అందుకే  మా సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మా లో సభ్యుడిగా లేనప్పటికీ బయటనుండి పరిశ్రమ కోసం తన సహకారం అందిస్తా అన్నారు. తెలుగు సినిమాలలో నటిస్తాను, దానిని ఎవరూ ఆపలేరని ప్రకాష్ రాజ్ ధీమాగా చెప్పారు. చివర్లో ఇది ఇంతటితో ముగియలేదు... అసలు సినిమా ముందు ఉందని చెప్పి, షాక్ ఇచ్చారు. 

Also read MAA elections:మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..!
ప్రకాష్ రాజ్ గెలుపుకోసం గట్టిగా  ప్రయత్నం చేసిన నాగబాబు సైతం మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇలాంటి సంకుచిత భావాలు కలిగిన అసోసియేషన్ లో మెంబర్ గా ఉండలేనని వెల్లడించడం జరిగింది. నేడు ప్రకాష్ రాజ్ సైతం మా సభ్యత్వానికి ఇదే కారణం చూపుతూ, పక్కకు తొలగడం విశేషంగా మారింది. 


నిన్న వెలువడిన మా అధ్యక్ష ఎన్నికలలో Manchu vishnu వంద ఓట్లకు పైగా మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై గెలుపొందారు. MAA elections లో ఇరు ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విషయంలో పోటీ తీవ్ర స్థాయిలో నడిచింది. మొదట్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ జోరు చూపించింది. ఆ ప్యానెల్ కి చెందిన శివారెడ్డి, కౌశిక్, విజయం సాధించారు. ఆ తరువాత మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఊపందుకున్నారు. 

Also read Maa elections: విక్టరీ అనంతరం ప్రకాష్ రాజ్ ని కౌగిలించుకొని ఏడ్చేసిన మంచు విష్ణు
కీలకమైన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులు సైతం మంచు విష్ణు ప్యానెల్ నుండి పోటీ చేసిన రఘుబాబు, శివబాలాజీ దక్కించుకున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిని మంచు విష్ణు ప్యానెల్ కోల్పోయింది. నటుడు బాబు మోహన్ పై ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన శ్రీకాంత్ 125  ఓట్ల భారీ మెజారిటీతో ఆ పదవి దక్కించుకున్నారు. 
నాకు ఆత్మ గౌరవం ఉంది. 

click me!