నా బిడ్డకు చిరు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉండాలి.. మీడియా ముందుకు వెళ్లొద్దు, మోహన్ బాబు కామెంట్స్

By telugu teamFirst Published Oct 11, 2021, 9:55 AM IST
Highlights

కొన్ని వారాలుగా తీవ్రమైన వివాదాలు, విమర్శలతో మీడియాలో నానుతూ వచ్చిన మా ఎన్నికలు ముగిశాయి. తీవ్రమైన పోటీలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించాడు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

కొన్ని వారాలుగా తీవ్రమైన వివాదాలు, విమర్శలతో మీడియాలో నానుతూ వచ్చిన మా ఎన్నికలు ముగిశాయి. తీవ్రమైన పోటీలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించాడు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. మా ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. 

అభ్యర్థులు కూడా ప్రాణం పెట్టి ప్రచారం చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు పరస్పరం విమర్శల దాడికి దిగారు. ఇదిలా ఉండగా మంచు విష్ణుకి మద్దతు తెలిపిన నరేష్.. ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన నాగబాబు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. 

నిన్న జరిగిన పోలింగ్, ఫలితాలతో ఈ వివాదాలన్నింటికీ తెరపడింది. తన తనయుడి విజయం కోసం మోహన్ బాబు ఎంతగానో కృషి చేశారు. ఇండస్ట్రీలో తన పరిచయాలని ఉపయోగించారు. విష్ణు విజయం ఖరారయ్యాక మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Maa elections: విక్టరీ అనంతరం ప్రకాష్ రాజ్ ని కౌగిలించుకొని ఏడ్చేసిన మంచు విష్ణు

'అందరికి నమస్కారం.. ఇది ఒకరి విజయం కాదు. సభ్యులందరి విజయం. ఓటింగ్ ఎటువైపు పడినప్పటికీ 'మా' ఆశీస్సులతో బిడ్డ గెలిచాడు. ఎన్నో హామీలు ఇచ్చాడు ఎంతో జరిగింది. గతం గతః. వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. మా ప్రెసిడెంట్ అనుమతి లేకుండా ఎవ్వరూ మీడియా ముందుకు వెళ్లొద్దు. అనవసరంగా విమర్శలు చేయవద్దు అని మోహన్ బాబు సూచించారు. 

ఇక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం 'మా'కి ఉంటుందని Mohan babu అన్నారు. నా తమ్ముడు నరేష్.. విష్ణు విజయం కోసం ఎంతో కష్టపడ్డాడు. దాదాపు 800 మంది సభ్యులకు స్వయంగా ఫోన్స్ చేశాడు. నరేష్ కృషికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, బాలయ్య, నాగార్జున.. నా ఆత్మీయులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలని కోరుతున్నా అంటూ మోహన్ బాబు కామెంట్స్ చేశారు.  

click me!