వినూత్న పబ్లిసిటీతో రామ్ చరణ్ ధృవ

Published : Nov 12, 2016, 01:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
వినూత్న పబ్లిసిటీతో రామ్ చరణ్ ధృవ

సారాంశం

ధృవ రిలీజ్ కి ముందు సినిమా పై క్రేజ్ పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలుచేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇంకాస్త క్లారిటీగా చెప్పాలంటే గతంలో సరైనోడు చిత్రానికి అనుసరించిన ప్రమోషన్ స్ట్రాటజీనే ధృవకు అప్లై చేస్తున్నాడని చెప్పవచ్చు.

గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతండటంతో.. అల్లు అరవంద్ తనదైన శైలిలో ధృవ ప్రమోషన్ ను కొనసాగిస్తున్నాడు. ముందు ఈ సినిమా రిలీజ్ డేట్స్ మార్చి.. అంచనాలు తగ్గించాడు. తర్వాత ఒక్కోక్కటిగా ఫస్ట్ లుక్ పోస్టర్.. ఆ తర్వాత స్మాల్ టీజర్. ఇప్పుడు ఆడియోను డైరెక్ట్ గా మార్కేట్ లోకి లాంచ్ చేసాడు. పాటలు ఆశ్వాదిస్తున్నారో లేదో..అంతలోనే సినిమాలో సూపర్ హిట్ ట్రాక్ గా నిలిచిన చూశా చూశా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసాడు.

గతంలో రామ్ చరణ్ నటించిన ఏ చిత్రానికి కూడా ఇలాంటి ప్రమోషన్ స్ట్రాటజీ ఫాలో కాలేదు. అంతే కాదు.. ఇంత వరకు మగధీర తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్...కొత్త సినిమాకు కొత్తగా ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్నాడు. నెటిజన్లను మచ్చిక చేసుకుంటున్నాడు. సినిమాకు సంబంధించిన విషయాలు, చిట్ చాట్ లు ఈ మధ్య కాలంలో చెర్రీ నుంచి కామన్ గా కనిపిస్తున్నాయి.

డిసెంబర్ 2న ప్రేక్షకులముందుకు వస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అరవింద్ స్వామి కీలకపాత్రలో నటిస్తున్నాడు. రుకల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

కోలీవుడ్ యువ మ్యూజిక్ డైరెక్టర్లు హిప్ హాప్ తమిజా ధృవకు పాటలు కంపోజ్ చేసారు. ప్రస్తుతానికి మేగా ఫ్యాన్స్ నుంచి పాటలకు మంచి రెస్పాన్సే వస్తోంది. రామ్ చరణ్ ఎనర్జీకి తగ్గ ట్రాక్ అందించారని మేగాభిమానులు సంతోష పడుతున్నారు. సినిమా రిలీజ్ కి ముందు గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయట.

PREV
click me!

Recommended Stories

నీలి రంగు లెహెంగాలో ఆషికా అందం
2025లో గూగుల్ సెర్చ్ లో టాప్ లో నిలిచిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. పవన్, ప్రభాస్ కి ఝలక్ ఇచ్చిన అల్లు అర్జున్