
ఒకే బంగారం సక్సెస్ ఇచ్చిన ఉత్సాహం మణిరత్నం మరోసారి మీడియం రేంజ్ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో మణిరత్నం మూవీ అంటే.. మూడు భాషల్లో తెరకెక్కేవి. ఏ బాషకు సంబంధించిన హీరో ఆ భాషలో కనిపించేవాడు. రావన్ చిత్రాన్ని ఇలాగే తీసుకొచ్చాడు. కానీ ఫ్లాపులు ఎదురవుతుండటంతో.. కోలీవుడ్ కే పరిమితమై సినిమాలు తీసాడు. కడలి తీస్తే జనం పట్టించుకోలేదు.దీంతో డిసప్పాయింట్ అయిన లెజెండరీ దర్శకుడు కాస్త టైమ్ తీసుకోని.. మీడియం బడ్జెట్ తో సున్నితమైన ప్రేమకథలు తీయడం మొదలు పెట్టాడు. ఒకే బంగారం సినిమా అలా తీసిందే. మళయాలంలో స్టార్ గా ఎదిగిన హార్ట్ త్రోబ్ ను సౌత్ కి ఇంట్రడ్యూస్ చేసాడు. సౌత్ లో క్రేజ్ ఉన్న నిత్యామీనన్ ను తన సినిమాకు ఎంపిక చేసుకోని.. తమిళ, తెలుగు,మళయాల బాషల్లో రిలీజ్ చేసి భారీ వసూళ్లను కొల్లగొట్టాడు. హిందీలో ఇదే సినిమాను ఒకే జానూ పేరుతో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం మణిరత్నం కార్తి, అధితిరావ్ హైద్రీ కాంబినేషన్ లో చక్కటి ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తీ పైలట్ గా కనిపిస్తున్నాడు. మార్చి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాకు డ్యూయెట్ అనే టైటిల్ అనుకున్నారు. గతంలో మణిరత్నం ఒకే బంగారం చిత్రాన్ని తెలుగులో అందించిన దిల్ రాజు ఈ కొత్త చిత్రాన్ని కూడా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కార్తి... ఈ దశలో చేస్తోన్న మణిరత్నం మూవీ ఆయన కెరీర్ లో ఒ గొప్ప చిత్రంగా నిలవనుందనే టాక్ ఉంది. రీసెంట్ గా కాష్మోరా తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టున్నాడు కార్తీ.