
ఇంకొక్కడు సక్సెస్ విక్రమ్ లో మరింత కన్ ఫ్యూజన్ పెంచిందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇంకొక్కడు సినిమాకు ముందు విక్రమ్ సామి 2 తీయాలని ఆశపడ్డాడు. ప్రయోగాలకు చెక్ పెట్టాలని భావించాడు. కానీ ఇంకొక్కడులో విక్రమ్ కనిపించిన లవ్ క్యారక్టర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఓ మోస్తరు విజయం సాధిస్తే చాలు అనుకుంటే భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ నటించిన ఇంకొక్కడు 100 కోట్ల వసూళ్లను అందుకుంది.
ఇంకొక్కడు విజయాన్ని మరోమారు రిపీట్ చేయాలనుకుంటున్నాడు విక్రమ్...అందుకే..మరోసారి ప్రయోగానికే ఒటు వేయాలని చూస్తున్నాడు. ఇందుకోసం డైరెక్టర్ హరి తో చేయాల్సిన సామి2 ను పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ సూపర్ హిట్ డోన్ట్ బ్రీత్ పై విక్రమ్ మనసు పడ్డాడు. ఓ అంధుడి ఇంట్లో దొంగతనానికి వెళ్లిన అల్లరి మూకలకు ఆ అంధుడు ఎలా చెక్ పెట్టాడు అన్నది స్టోరీలైన్. అందులో అంధుడి పాత్రలో విక్రమ్ నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంకొక్కుడు మూవీ తీసిన ఆనంద్ శంకర్ నే మరో మారు దర్శకుడిగా రిపీట్ చేయాలనుకుంటున్నాడు. అయితే.. గౌతమ్ మీనన్ కూడా విక్రమ్ కోసం ఓ కథను సిద్ధం చేసాడట. అయితే విక్రమ్ మాత్రం ముందు డోన్ట్ బ్రీత్ మూవీ రీమేక్ పూర్తైన తర్వాతే సామి2 కానీ లేదా గౌతమ్ మీనన్ సినిమాలు చేసే ఆలోచన చేస్తున్నాడు.
విక్రమ్ పట్టుపట్టి , ఆరోగ్యం పాడుచేసుకోని.. ప్రయోగాలు చేస్తే జనం పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత .... ఇంకొక్కడు లాంటి ప్రయోగానికి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టడంతో.. విక్రమ్ మళ్లీ యూ టర్న్ తీసుకోకతప్పలేదు.