మరదలు వరస అయ్యే అమ్మాయితో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ వివాహం.. వధువు గురించి ఆసక్తికర వివరాలు

Published : Dec 07, 2023, 09:28 PM IST
మరదలు వరస అయ్యే అమ్మాయితో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ వివాహం.. వధువు గురించి ఆసక్తికర వివరాలు

సారాంశం

అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ పెళ్లి ఘనంగా శ్రీలంకలో జరిగింది.

అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ పెళ్లి ఘనంగా శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కి దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. గత కొంతకాలంగా అభిరామ్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 

అయితే ఎట్టకేలకు అభిరామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అభిరామ్ పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు.. తనకు మరదలు వరస అయ్యే అమ్మాయినే. ఆమె పేరు ప్రత్యుష. వారి స్వస్థలం కారంచేడు. సురేష్ బాబు తండ్రి, ఒకప్పటి అగ్ర నిర్మాత రామానాయుడు స్వగ్రామం కూడా కారంచేడు కావడం విశేషం. వీరి బంధువుల అమ్మాయే ప్రత్యుష. 

రామానాయుడు తమ్ముడి మనవరాలినే(రామానాయుడు తమ్ముడి కూతురు బిడ్డ) అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. ఇది కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి. తాజాగా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వధూవరులు సాంప్రదాయ వస్త్ర ధారణలో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. 

హీరోగా ఎంట్రీ కాకముందే అనేక వివాదాల్లో అభిరామ్ నిలిచాడు. ఇప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. అభిరామ్ నటించిన తొలి చిత్రం అహింస తేజ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.  

Also Read: కేశవకి బెయిల్ రాకుంటే పుష్ప 2 పరిస్థితి ఏంటి.. అల్లు అర్జున్, సుకుమార్ కి ఊహించని చిక్కులు

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు