చిరంజీవి నివాసానికి నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్... మెగా హీరోలతో భేటీ!

By Sambi ReddyFirst Published Dec 7, 2023, 8:50 PM IST
Highlights

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ చిరంజీవి నివాసానికి వచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు మెగా హీరోలు ఆయనకు స్వాగతం పలికారు. 
 

ఫస్ట్ టైం హైదరాబాద్ లో అడుగుపెట్టాడు నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ సీఈఓ టెడ్ సరండోస్. ఆయన నేరుగా చిరంజీవి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంచరించుకుంది. టెడ్ సరండోస్ తో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల భేటీ అందరినీ ఆకర్షించింది. నేషనల్ వైడ్ టాక్ అయ్యింది. టెడ్ సరండోస్, చిరంజీవి, రామ్ చరణ్ ల భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వీరితో జాయిన్ అయ్యారు. 

సమకాలీన సినిమా, ఓటీటీ కంటెంట్, మార్కెట్, కంపిటీషన్ వంటి పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. నెట్ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్ లో స్ట్రగుల్ అవుతుంది. హాట్ స్టార్, అమెజాన్ దూకుడు చూపిస్తుండగా సబ్స్క్రైబర్స్ ని ఆకర్షించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇండియా ఓటీటీ మార్కెట్ షేర్ పెంచుకునేందుకు నెట్ఫ్లిక్స్ స్టార్ హీరోల భారీ చిత్రాలు కొనుగోలు చేస్తుంది. 

Latest Videos

మరోవైపు రామ్ చరణ్, చిరంజీవి తమ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం. ఇక చిరంజీవి బింబిసార ఫేమ్ వశిస్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. 

click me!