Jai Bhim: 'జై భీమ్' మూవీపై సీపీఐ నారాయణ కామెంట్స్..37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది

By telugu teamFirst Published Nov 6, 2021, 3:00 PM IST
Highlights

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలు తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబడుతుంటాయి. 

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలు తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబడుతుంటాయి. సూర్య మాస్ ఇమేజ్ చక్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నాడు. గత ఏడాది 'ఆకాశం నీ హద్దురా'.. ఈ ఏడాది జై భీమ్ లాంటి విభిన్నమైన చిత్రాలతో సూర్య ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. 

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన Jai Bhim చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. 1993లో తమిళనాడులో జరిగిన వాస్తవిక కథ ఆధారంగా దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. సీనియర్ లాయర్ చంద్రు అప్పట్లో గిరిజన మహిళ తరుపున పోరాటం చేశారు. ఆ కథాంశంతోనే జై భీమ్ చిత్రం తెరకెక్కింది. Suriya నటన, జై భీమ్ చిత్రంపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం జై భీమ్ చిత్రంపై ప్రశంసల కురిపించారు. ఆ చిత్రం చూశాక నా హృదయం బరువెక్కింది అని తెలిపారు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జైభీమ్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సినిమాపై అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. 

Also Read: `జై భీమ్‌`లో సినతల్లి ఎవరో తెలుసా?.. ఆమె నేపథ్యం, స్టడీస్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

CPI Narayana మాట్లాడుతూ.. నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒకదానిని అందరి కళ్ళకు కట్టినట్లు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చూస్తున్నంతసేపు నాకు సినిమా చూసినట్లు అనిపించలేదు. అశ్లీలత, హింస లేదు. సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రజల్లో పోరాటాలు చేసిన నాకు ఈ చిత్రం చూశాక తిరుపతిలో జరిగిన ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. 37 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అది. 

Also Read: శ్రీజ భర్త ఏమైనట్లు.. మెగా ఫోటోలలో మిస్సింగ్.. మొదలైన రూమర్లు ?

ఈ చిత్రంలో సినతల్లి పెట్టిన కేసుని ఉపసంహరింపజేయాలని పోలీస్ ప్రయత్నిస్తుంటాడు. అదే తరహాలో తిరుపతిలో ఓ సంఘటన నా కళ్ళ ముందు మెదిలింది. తిరుపతిలో లక్ష్మి అనే అభాగ్యురాలు కోతిని ఆడించుకుంటూ జీవనం సాగించే మహిళ. ఆమెకు ఎలాంటి ఇల్లు లేదు.రాత్రి సమయాల్లో ఏదో ఒక ఫ్లాట్ ఫామ్ పై పడుకునేది. ఎప్పటిలాగే రాత్రి సమయాల్లో పోలీస్ కానిస్టేబుల్ లాఠీతో బిచ్చగాళ్ళని తరుముతూ వచ్చాడు. దీనితో బిచ్చగాళ్లంతా పారిపోతున్నారు. 

లక్ష్మి కూడా తన కోతిని పట్టుకుని వెళుతున్న సమయంలో కానిస్టేబుల్ ఆమెని తన్నాడు. దీనితో పక్కనే ఉన్న రాయి ఆమె తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయానికి మా పార్టీ యువజన నాయకులు సినిమా చూసి టీ కోసం బస్టాండ్ వద్ద ఆగారు. ఈ సంఘటన గురించి వాళ్లకు తెలిసింది. నిరసన తెలపడానికి ఘటన స్థలానికి మేము కూడా చేరుకున్నాము. మృత దేహాన్ని తోపుడు బండిపై పెట్టుకుని తెల్లవారు జామున నుంచి నిరసన మొదలు పెట్టాం. 

25 మందితో ప్రారంభమైన నిరసనకు వందలాది మంది ప్రజలు మద్దతు తెలిపారు. మరుసటిరోజు బంద్ కి కూడా పిలుపునిచ్చాం. అదే రోజు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుపతి పర్యటనకు వస్తున్నారు. దీనితో కలెక్టర్, ఎస్పీ నాతో మాట్లాడారు. సీఎం పర్యటన ఉన్నందున బంద్ ఉపసంహరించుకోవాలని కోరారు. వారి ప్రతిపాదనని నేను తిరస్కరించాను. 

Also Read: బోల్డ్ షోతో ఇంటర్నెట్ లో మంట పెడుతున్న ఇషా.. కుక్క పిల్లతో రొమాన్స్

దీనితో చనిపోయిన లక్ష్మి ఈ ప్రాంతం కాదు, ఆస్థిపరురాలు కూడా కాదు. ఆమె కోసం పోరాటం చేస్తే మీ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు అని కలెక్టర్,ఎస్పీ నాతో అన్నారు. నేను ఈ పోరాటం పార్టీ కోసమే, మరో ప్రయోజనం కోసం చేయడం లేదు.. ప్రజల్లో చైతన్యం, ధైర్యం పెరగాలి.. ఇలాంటి సంఘటనల విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే చేస్తున్నా అని సమాధానం ఇచ్చా. అనుకున్నదాని ప్రకారం బంద్ విజయవంతం చేశాం. నా పై కేసులు కూడా పెట్టారు అని నారాయణ అన్నారు. 

click me!