Mega 154 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుండగా, దర్శకుడు కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ(boby) తెరకెక్కిస్తున్నారు.
మెగా స్టార్ చిరంజీవి నేడు తన 154వ చిత్రానికి అంకురార్పణ చేశారు. పూజా కార్యక్రమాలతో చిరంజీవి నూతన చిత్రం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ వేదికగా వేడుకలో చిత్ర ప్రముఖులు కె రాఘవేంద్ర రావు, పూరి జగన్నాధ్, కొరటాల శివ, హరీష్ శంకర్ పాటు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన చిరంజీవి మాస్ లుక్ పోస్టర్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. 90 ల నాటి చిరంజీవి ఊర మాస్ లుక్ ని లేటెస్ట్ లుక్ గుర్తు చేస్తుంది. చాలా కాలంగా ఫ్యాన్స్ చిరుని ఈ తరహా రోల్ లో చూడాలని ఎంతో ఆశపడుతుండగా, వారి కోరిక నెరవేరింది.
ఇక Mega 154 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుండగా, దర్శకుడు కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ(boby) తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా బాబీ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ''మెగాస్టార్, ఆయన పేరు వింటే...అంతు లేని ఉత్సాహం ! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం ! తెర మీద ఆయన కనబడితే...ఒళ్ళు తెలీని పూనకం !పద్దెనిమిదేళ్ల క్రితం....ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల... నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను'' అంటూ తన ఆనందం తెలియజేశారు. ఒకప్పుడు చిరంజీవితో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
Also read Suama kanakala: పవర్ ఫుల్ టైటిల్, రెబల్ లుక్... యాంకర్ సుమ సెన్సేషనల్ రీఎంట్రీ
మెగాస్టార్ వీరాభిమాని అయిన బాబీ... చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దర్శకుడిగా పరిశ్రమకు రాకముందు మెగాస్టార్ పేరిటిన నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. చిరంజీవితో మూవీ చేయాలన్న తన చిరకాల స్వప్నం ఇలా నిజమైంది. ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు చిరంజీవి. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కి అధికారిక రీమేక్ ఈ చిత్రం. పొలిటికల్ థ్రిల్లర్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుంది. మెహర్ రమేష్ తో భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్.
Also read శ్రీజ భర్త ఏమైనట్లు.. మెగా ఫోటోలలో మిస్సింగ్.. మొదలైన రూమర్లు ?
ఇక దర్శకుడు కొరటాల శివతో చేసిన ఆచార్య (Acharya) పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆచార్య మూవీలో రామ్ చరణ్ (Ram charan) మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరుకు జంటగా కాజల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 4న విడుదల కానుంది.