Bandla Ganesh: బ్రేకింగ్ న్యూస్.. స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్!

Published : Dec 27, 2021, 02:11 PM IST
Bandla Ganesh: బ్రేకింగ్ న్యూస్.. స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్!

సారాంశం

నటుడు నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఓ కేసులో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచవలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో నేడు ఆయన కోర్టులో హాజరు కానున్నారు.

బండ్ల గణేష్ తరచుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన చర్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. అదే క్రమంలో ఆయన కొన్ని ఆర్ధిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో కడప ప్రాంతానికి చెందిన మహేష్ అనే వ్యక్తి బండ్ల గణేష్ పై కేసుపెట్టారు. తన వద్ద రూ. 13 కోట్ల రూపాయలు తీసుకున్న బండ్ల గణేష్ తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. తాజాగా ఇలాంటి మరో కేసు బండ్ల గణేష్ పై నమోదైనట్లు తెలుస్తుంది. 

బండ్ల గణేష్ తనకు చెల్లించాల్సి అమౌంట్ తిరిగి ఇవ్వడం లేదని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ముప్పాళ్ల అనే గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర బండ్ల గణేష్ డబ్బులు తీసుకోవడం జరిగింది. బండ్ల గణేష్ అప్పు తిరిగి చెల్లిస్తూ జెట్టి వెంకటేశ్వర్లుకి రూ. 1.25 కోట్లకు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడం జరిగింది. దీంతో చట్టబద్దమైన చర్యలకు జెట్టి వెంకటేశ్వర్లు ఉపక్రమించారు. పలుమార్లు కోర్టు నోటీసులు పంపినా బండ్ల గణేష్ స్పందించలేదు. 

పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ విచారణకు హాజరుకాకపోవడంతో ఒంగోలు సెకండ్  ఏఎంఎం కోర్ట్ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవలసినదిగా ఆదేశించింది. దీంతో నేడు బండ్ల గణేష్ కోర్ట్ విచారణకు హాజరుకానున్నారని సమాచారం. గతంలో కూడా బండ్ల గణేష్ పై ఇలాంటి ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక సాధారణ నటుడిగా కెరీర్ ఆరంభించిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్(NTR) వంటి టాప్ స్టార్స్ తో సినిమాలు తీసే నిర్మాతగా ఎదిగారు. 

Also read ఏపీలో 175 థియేటర్లు క్లోజ్.. RRR, రాధే శ్యామ్ పరిస్థితి ఏంటి ?
2009లో విడుదలైన రవితేజ ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్... తొమ్మిది చిత్రాల వరకు నిర్మించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తీన్ మార్, గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ తో బాద్ షా,   టెంపర్ చిత్రాలు రూపొందించారు. త్వరలో పవన్ కళ్యాణ్ తో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పట్లో బండ్ల గణేష్ తో మూవీ చేసే అవకాశం లేదు. పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ కి ఆయన ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 

Also read AP Cinema tickets price row.. వైఎస్ జగన్ ను కలవనున్న చిరంజీవి
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?