RRR movie: జక్కన్నకు గుబులు పుట్టించే కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. ప్రభుత్వానికి గ్రేట్ ఐడియా

By team telugu  |  First Published Dec 27, 2021, 1:24 PM IST

దేశవ్యాప్తంగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటిలాగే ఈ చిత్రంపై కూడా రాజమౌళి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు.


దేశవ్యాప్తంగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటిలాగే ఈ చిత్రంపై కూడా రాజమౌళి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు. జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడమే మిగిలి ఉంది. 

ఇప్పటికే ఈ చిత్రం కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది.. జనవరి 7న థియేటర్స్ లో సునామినే అని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ కంగారు పెడుతోంది. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజు రోజుకు కేసులు పెడుతుతుండడంతో అందరిలో కంగారు మొదలైంది. 

Latest Videos

undefined

దీనితో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా కాస్త ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తన కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ.. రాజమౌళి గుండెల్లో గుబులు కలిగించే కామెంట్స్ చేశాడు.రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా.. 'ఒమిక్రాన్ ని అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఒక గ్రేట్ ఐడియా ఇస్తున్నా. కోవిడ్ వ్యాక్సిన్ డబుల్ డోస్ వేసుకోని వారిని RRR movie థియేటర్స్ లోకి పంపవద్దు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రూఫ్ చెక్ చేసి పంపాలి. లేకుంటే ఒమిక్రాన్ మరింత తీవ్రంగా మారుతుంది' అంటూ వర్మ ట్వీట్ చేశాడు. 

I have a GREAT idea for the GOVERNMENT regarding OMICRON😎😎😎…They should not allow anyone into theatres unless they show proof of DOUBLE DOSE ..The DESIRE to see will CONQUER the CARELESSNESS of the PEOPLE 💪💪💪

— Ram Gopal Varma (@RGVzoomin)

వర్మ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. తొలిసారి వర్మ అర్థవంతమైన వ్యాఖ్యలు చేసారు అంటూ సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు వర్మని వ్యతిరేకిస్తున్నారు. ఓమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువమంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారే. డబుల్ డోస్ తీసుకున్నంత మాత్రాన ఒమిక్రాన్ రాదని చెప్పలేం అని అంటున్నారు. 

వర్మ చెప్పినట్లు ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనతో ముందు వస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ కి చిక్కులు తప్పవు. ఎందుకంటే దేశంలో ఇంకా పూర్తిస్థాయిలో డబుల్ డోస్ వ్యాక్సిన్ పూర్తి కాలేదనే చెప్పాలి. 

Also Read: 2021 Roundup: ఈ ఏడాది ఫ్లాపుల నుంచి గట్టెక్కిన హీరోలు

click me!