‘పుష్ప’ రిలీజ్ సమస్య, బన్ని స్వయంగా సీన్ లోకి వచ్చేకే సాల్వ్ !

By Surya Prakash  |  First Published Nov 16, 2021, 11:30 AM IST

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, యూట్యూబ్ ఛానెల్ ఓనర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. 


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. అయితే ఈ చిత్రం హిందీలో విడుదలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ చానెల్ కు ముందే హిందీ రైట్స్ ఇచ్చేసారని,ఇప్పుడు ప్యాన్ ఇండియా అనుకున్న తర్వాత ఆ రైట్స్ వెనక్కి ఇవ్వమని నిర్మాతలు అడిగితే వారు నో అని చెప్పారట. దాంతో హిందీ రిలీజ్ లేనట్లే అని అందరూ భావించారు. అయితే తాజాగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, యూట్యూబ్ ఛానెల్ ఓనర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. 

అల్లు అర్జున్ చొరవ తీసుకుని యూట్యూబ్ రైట్స్ తీసుకున్న వారితో స్వయంగా చర్చించి విజయం సాధించారు. దాంతో ఇప్పుడు  “పుష్ప” వెర్షన్ రిలీజ్ కు మార్గం సుగమమైంది.  ‘పుష్ప' మూవీని హిందీలో గోల్డ్‌మైన్ టెలీఫిల్మ్స్ సంస్థ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సదరు సంస్థతో చర్చలు జరిపిందట. ఈ క్రమంలోనే హిందీ థియేట్రికల్ లాభాల్లో ఎక్కువ శాతం ఆ సంస్థకు ఇచ్చేందుకు మైత్రీ సంస్థ ముందుకొచ్చిందట. అలాగే, విడుదల ఖర్చులను కూడా భరించబోతుందట. అందుకే దీనికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.ఇప్పుడు “పుష్ప” 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. 

Latest Videos

సినిమా నుంచి నాలుగో సింగిల్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ నవంబర్ 19న విడుదల కానుంది.  ప్రస్తుతం సినిమా ట్రైలర్ హిందీలో డబ్ చేయబడుతుండగా.. అతి త్వరలోనే దీన్ని ఆవిష్కరించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం సహా ఒకేసారి ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అయిన మొదటి చిత్రంగా ''పుష్ప: ది రైజ్'' నిలవనుంది.

Also read Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ.. మరో ఊర మాస్ గెటప్ లో ఐకాన్ స్టార్

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ - అనసూయ - ధనుంజయ ఇతర కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also read అల్లు అర్జున్ యూటర్న్.. నానికి షాక్ అంటూ ఊహాగానాలు

click me!