సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

By narsimha lode  |  First Published Dec 12, 2019, 1:24 PM IST

గొల్లపూడి మారుతీరావు గురువారం నాడు కన్నుమూశారు.



హైదరాబాద్:  సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం నాడు చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు.

13 ఏళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేశారు. 250 పైగా చిత్రాల్లో గొల్లపూడి మారుతీరావు నటించారు. ఆరు నంది పురస్కారాలను ఆయన అందుకొన్నారు. 

Latest Videos

రచయితగా, నటుడుగా, వ్యాఖ్యాతగా ఆయన పనిచేశారు. గొల్లపూడి మారుతీరావు చివరి చిత్రం జోడి. ప్రేమ పుస్తకం సినిమాకు గొల్లపూడి మారుతీరావు నంది అవార్డును అందుకొన్నారు. 1939 ఏప్రిల్ 14న లో విజయనగరంలో గొల్లపూడి మారుతీరావు జన్మించారు.

Also Read: చిరంజీవి పాత్ర నేను చేసుంటే బాగుండేదని.. గొల్లపూడి

తన 14 ఏళ్లకే ఆశాజీవి అనే పేరుతో కథ రాశాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో గొల్లపూడి మారుతీరావు ఉద్యోగం సంపాదించాడు. ఆలిండియా రేడియోలో గొల్లపూడి మారుతీరావు పలు హోదాల్లో పనిచేశాడు. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంపాదకుడిగా ఆయన పనిచేశారు. 

ఆరు నంది అవార్డులు గొల్లపూడి మారుతీరావు అందుకొన్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం సినిమాకు గొల్లపూడి మారుతీరావు రచయితగా పనిచేశారు. డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ రచయితగా గొల్లపూడి మారుతీరావు నంది పురస్కారాన్ని అందుకొన్నారు.

రచయితగా, నటుడుగా, వ్యాఖ్యాతగా ఆయన వ్యవహరించారు. గొల్లపూడి మారుతీరావు చివరి చిత్రం జోడి. ప్రేమ పుస్తకం సినిమాకు గొల్లపూడి మారుతీరావు నంది అవార్డును అందుకొన్నారు. 1939 ఏప్రిల్ 14న లో విజయనగరంలో గొల్లపూడి మారుతీరావు జన్మించారు.

Also Read: జర్నలిస్టుగా గొల్లపూడి... అప్పట్లోనే గడగడలాడించాడు

తన 14 ఏళ్లకే ఆశాజీవి అనే పేరుతో కథ రాశాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో గొల్లపూడి మారుతీరావు ఉద్యోగం సంపాదించాడు. ఆలిండియా రేడియోలో గొల్లపూడి మారుతీరావు పలు హోదాల్లో పనిచేశాడు.1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంపాదకుడిగా ఆయన పనిచేశారు. కొంతకాలంగా గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంగా ఉన్నారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు ఆయన మృతి చెందారు.

 

 

 

click me!