సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం.. కేసులు పెడతా: ఆర్జీవీ

prashanth musti   | Asianet News
Published : Dec 12, 2019, 11:03 AM IST
సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం.. కేసులు పెడతా: ఆర్జీవీ

సారాంశం

విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం వివాదాల దర్శకుడిగా ట్యాగ్ అందుకుంటున్నాడు. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక వివాధం ఉండేలా చూసుకుంటున్న వర్మ ఒకప్పుడు ఏం చేసినా స్టైల్ గానే ఉండేది.

ఒకప్పుడు విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం వివాదాల దర్శకుడిగా ట్యాగ్ అందుకుంటున్నాడు. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక వివాధం ఉండేలా చూసుకుంటున్న వర్మ ఒకప్పుడు ఏం చేసినా స్టైల్ గానే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ప్రమోషన్స్ తో ఇంతకింతకు దిగజారుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక రీసెంట్ గా వర్మ తెరకెక్కించిన "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" నేడు విడుదలైంది. రిలీజ్ కు ముందు రోజు వరకు సినిమా సెన్సార్ నుంచి రావడానికి చాలా ఇబ్బందులు పడింది. మొదట కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో హడావుడి చేసిన వర్మ ఎట్టకేలకు సెన్సార్ దెబ్బకు టైటిల్ మార్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారని వర్మ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు.

ఈ సినిమాను ఆపడానికి చాలా మంచి ప్రయత్నించారు. కానీ వారివల్ల కాలేదు. అనుకున్నట్లుగానే సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు ఎవరో నాకు తెలుసు. త్వరలోనే ఆ విషయాన్నీ బయటపెడతా. చట్టపరమైన కేసులు కూడా పెడతాను అని వర్మ మీడియాకు వివరించాడు. ప్రస్తుతం  ‘ఎంటర్‌ ది గాళ్‌ డ్రాగన్‌’ చిత్రీకరణలో భాగంగా చైనా వెళ్లిన వర్మ అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?