బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న దబాంగ్ బ్యూటీ?

prashanth musti   | Asianet News
Published : Dec 12, 2019, 11:43 AM ISTUpdated : Dec 12, 2019, 12:41 PM IST
బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న దబాంగ్ బ్యూటీ?

సారాంశం

బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ తో దర్శనమిస్తున్న బాలయ్య ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అనంతరం మరో కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. 

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ తో దర్శనమిస్తున్న బాలయ్య ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అనంతరం మరో కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం దాదాపు 70కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. అసలైతే ఎన్టీఆర్ బయోపిక్ అనంతరం బాలయ్య తో సినిమాను స్టార్ట్ చేయాల్సింది. కానీ అప్పుడు బడ్జెట్ ఎక్కువవుతోందని సందేహించారు. బోయపాటి బడ్జెట్ విషయంలో కాస్త వెనక్కి తగ్గి కొన్ని సీన్ల విషయంలో ఖర్చు తగ్గించడంతో ఎట్టకేలకు సినిమా చేయడానికి బాలయ్య ముందుకు వచ్చాడు.

కానీ సినిమా లాంచ్ కి ముందు ప్లాన్స్ మారాయి. మళ్ళీ బడ్జెట్ లెక్కలు 70కోట్లకు చేరాయి.  అయితే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా బాలయ్యతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బోయపాటి సినిమాలకు శాటిలైట్ అండ్ డిజిటల్ లో మంచి మార్కెట్ ఉంది.

డబ్బింగ్ రైట్స్ గట్టిగా అందే అవకాశం ఉంది. అందుకే బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని రప్పిస్తున్నారట. సోనాక్షి సిన్హా గతంలో టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?