Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి

Siva Kodati |  
Published : Nov 28, 2021, 08:27 PM ISTUpdated : Nov 28, 2021, 08:56 PM IST
Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి

సారాంశం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన గతకొద్దిరోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం శివశంకర్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు.   

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన గతకొద్దిరోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం శివశంకర్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. 

శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడటంతో గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో చేరి క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. 

Also Read:Shiva Shankar master:షాకింగ్.. శివశంకర్ మాస్టర్ పరిస్థితి విషమం, వెంటిలేటర్ పై చికిత్స

విషయం తెలిసిన వెంటనే Chiaranjeevi హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నామంటూని అభయమిచ్చారు. చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ "నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు. అలాగే సోనూసూద్, తమిళ హీరో ధనుష్ కూడా సాయం చేశారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ శివశంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయారు.

బాహుబలి, మగధీర, మహాత్మ, అమ్మోరు, అరుంధతి లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. మగధీర చిత్రంలో 'ధీర ధీర' సాంగ్ కి కొరియోగ్రఫీ అందించింది శివశంకర్ మాస్టరే. ఆ పాటకు గాను శివశంకర్ మాస్టర్ కి నేషనల్ అవార్డు దక్కడం విశేషం. మగధీర చిత్రంలో ఆ సాంగ్ ఓ విజువల్ ఫీస్ట్ గా ఉంటుంది. శివశంకర్ మాస్టర్ 1975లోనే చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. సౌత్ ఇండియన్ భాషల్లో చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ ఎదిగారు. అలాగే నటుడిగా కూడా అనేక చిత్రాల్లో శివశంకర్ మాస్టర్ రాణించారు. డాన్స్ మాస్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్