Bigg boss telugu 5: హౌస్ లో కీలకంగా మారిన ఎవిక్షన్ ఫ్రీ పాస్... సన్నీ చేతిలో ఆ ఇద్దరి భవిష్యత్

Published : Nov 28, 2021, 05:39 PM ISTUpdated : Nov 29, 2021, 08:16 AM IST
Bigg boss telugu 5: హౌస్ లో కీలకంగా మారిన ఎవిక్షన్ ఫ్రీ పాస్... సన్నీ చేతిలో ఆ ఇద్దరి భవిష్యత్

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5(Bigg boss telugu 5) కీలక దశకు చేరుకుంది. ఫైనల్ కి ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండగా... పోటీ రసవత్తరంగా మారింది.   

టైటిల్ కి అతి చేరువగా కంటెస్టెంట్స్ రాగా... ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాలని ఎవరూ అనుకోరు. అలా ఎలిమినేట్ అయినవాళ్లు చాలా బాధపడతారు అనడంలో సందేహం లేదు. 13వారాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కంటెస్టెంట్స్ కి ఈ మూడు వారాలు చాలా కీలకం. టైటిల్ ఎవరు అందుకుంటారు అనే సమీకరణాలు చివర్లో మారిపోయే అవకాశం కూడా కలదు. కాగా నేడు ఆదివారం కావడంతో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. నిన్న సన్నీ, సిరి, శ్రీరామ్ సేవ్ అయ్యారు. ఇక మిగిలింది కాజల్, రవి, షణ్ముఖ్, ప్రియాంక. 

బిగ్ బాస్ షో లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా... షణ్ముఖ్, ప్రియాంక సేవ్ అయినట్లు తెలుస్తుంది. చివరికి కాజల్, రవి మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానుండగా.. ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ప్రకటించే లోపు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఒకరిని సేవ్ చేసే అధికారం సన్నీకి ఉంది. గతంలో సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుపొందారు. ఈ పాస్ తన కోసం లేదా, ఇంటి సభ్యులలోని ఎవరి కోసమైనా వాడవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించే  అవకాశం ఉంటుంది. 

కాజల్, రవి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుండగా ఎవరిని సేవ్ చేస్తావని నాగార్జున  సన్నీని అడిగారు. తనకు ఇద్దరు ఇష్టమే అని సన్నీ చెప్పాడు. అలోచించి నిర్ణయం తీసుకోమని షణ్ముఖ్ సన్నీకి సలహా ఇచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒకవేళ సన్నీ ఈ పాస్ ఉపయోగించి కాజల్ ని చేశాడు అనుకుందాం.. రిజల్ట్ ఓపెన్ చేసిన తర్వాత కాజల్ ఎలిమినేట్ అయినట్లు తెలిస్తే ఆమె సేవ్ అవుతుంది. రవి ఎటూ సేవ్ అయ్యాడు కాబట్టి ఇద్దరూ హౌస్ లో ఉంటారు. ఒక వేళ కాజల్ కోసం పాస్ వాడినప్పుడు రిజల్ట్ లో ఆమె సేవ్ అయినట్లు తెలిస్తే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎందుకు పనికిరాకుండా పోయిందని అర్థం. అప్పుడు రవి హౌస్ నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది. 

Also read Bigg Boss Telugu 5: సన్నీ Vs షణ్ముఖ్.. శృతి మించిపోయిన ఫ్యాన్స్ వార్, చేతులు జోడించి వేడుకుంటోంది

ఇద్దరూ ఇంటిలో ఉండాలని సన్నీ కోరుకుంటే... ప్రేక్షకులు రవి, కాజల్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేసి ఉండవచ్చని ఊహియించి  నిర్ణయం తీసుకోవాలి. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. అయితే రవి ఎలిమినేట్ అయ్యాడని విశ్వసనీయ సమాచారం అందుతుండగా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీ కాజల్ కోసం వాడి ఉంటాడు. రిజల్ట్ లో కూడా ఆమె సేవ్ కావడంతో పాస్ ఎందుకు పనికిరాకుండా పోయి ఉంటుంది. అదే పాస్ ద్వారా రవిని సేవ్ చేసి ఉంటే.. ఇద్దరూ హౌస్ లో ఉండేవారు. 

Also read Bigg boss telugu 5:షాకింగ్ న్యూస్... బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి అవుట్!

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్