మెగా బ్రదర్స్ కోసం స్టార్ డైరెక్టర్ వెయిటింగ్.. ఆల్మోస్ట్ ఫిక్స్ ?

pratap reddy   | Asianet News
Published : Nov 28, 2021, 07:54 PM IST
మెగా బ్రదర్స్ కోసం స్టార్ డైరెక్టర్ వెయిటింగ్.. ఆల్మోస్ట్ ఫిక్స్ ?

సారాంశం

క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్ లో పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస విజయాలతో అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. 

క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్ లో పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస విజయాలతో అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మాస్ కు నచ్చే అంశాలని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి, కామెడీని హైలైట్ చేస్తూ సినిమాని విజయపథంలో నడిపించడంలో Anil Ravipudi దిట్ట. ఎఫ్3 తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే చిత్రం గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. పవర్ స్టార్ Pawan Kalyan ని డైరెక్ట్ చేసేందుకు అనిల్ రావిపూడి చాలా ఆసక్తిగా ఉన్నారు. దీనికోసం తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచే సరైన క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. 

ఎలాగైనా పవన్, అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ చేయాలని దిల్ రాజు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలని ఉన్నట్లు ఓ సందర్భంలో తెలిపారు. ఇదిలా ఉండగా అనిల్ గురించి మరో క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ లో వైరల్ గా మారింది. 

మెగాస్టార్ Chiranjeevi కూడా అనిల్ రావిపూడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో వరుసగా సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ గా అనిల్ నిలిచిపోవడం ఖాయం. 

Also Read: Deepika Pilli: నాజూకైన ఒంపులతో దీపికా పిల్లి అందాల మాయ.. ఆగలేకపోతున్న కుర్రాళ్లు

అనిల్ రావిపూడి చిత్రాల్లో హాస్యభరితమైన అంశాలు తప్పకుండా ఉంటాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్, అనిల్ ల కోసం దిల్ రాజు ప్రయత్నిస్తుండగా.. చిరంజీవి చిత్రానికి సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్