
మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు బాక్సాఫీస్ మీద చేసే దండయాత్ర ఎలా ఉంటుందో మనకు తెలుసు. మెగా పవర్ స్టార్ గా మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న చరణ్ తో పాటుగా స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ అదిరిపోయే సినిమాలతో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే.. అదేంటి ఎవడు చేశారుగా అంటారు. కానీ ఎవడు ఫుల్ ప్లెడ్జ్ గా ఇద్దరు హీరోలకు సెపరేట్ కేరక్టర్స్ ఉన్న సినిమా కాదు. అది ఒకే కేరక్టర్.
ఎవడు సినిమా ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చింది. బన్ని అందులో చిన్న రోలే చేశాడు.. అంతేకాదు చెర్రి బన్ని ఒక్క ఫ్రేం లో కూడా కనిపించరు. అందుకే అది మల్టీస్టారర్ కిందకు రాలేదు. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరక్టర్ ఇద్దరిని కలిపి ఓ సినిమా తీసేలా కథ రాస్తున్నాడట. సినిమా మొత్తం ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించేలా స్టోరీ రాస్తున్నాడట.
ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో చరణ్-అర్జున్ అని ఓ టైటిల్ రిజిస్టర్ చేయించారట కూడా. మరి గీతా ఆర్ట్స్ బ్యానర్లో రిజిస్టర్ అయిన టైటిల్ వారిద్దరి కోసమే అని తెలిసిందే. ఎవరి సత్తా వారు చాటుతున్న ఈ తరుణంలో మంచి కథ వస్తే కలిసి చేసేందుకు రెడీ అంటున్నారు.
బన్ని చెర్రిల మధ్య ఈమధ్య కాస్త తేజాలు వచ్చాయని వార్తలొచ్చాయి. ఓ భారీ మల్టీస్టారర్ తీసి ఇద్దరి మధ్య ఏం లేదు ఇదంతా మిగతా వాళ్ల సృష్టే అని చెప్పబోతున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీ చేయడం ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. మరి ఆ సినిమా ఎప్పుడు ఎలా తెరకెక్కనుందో చూడాలి.