జాలీ ఎల్‌ఎల్‌బి  సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్:  అక్షయ్‌కుమార్‌

Published : Jan 29, 2017, 08:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
జాలీ ఎల్‌ఎల్‌బి  సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్:  అక్షయ్‌కుమార్‌

సారాంశం

యాక్షన్‌ హీరోగా మంచి గుర్తింపు ఉన్న బాలీవుడ్ హిరో అక్ష‌య్ కుమార్   ఆ ఇమేజ్‌కి భిన్నంగా జాలీ ఎల్‌ఎల్‌బి -2 కామేడి మూవీ లో న‌టించిన అక్ష‌య్    ఫిబ్రవరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మూవీ

 

 

 ఈ సందర్భంగా చిత్ర కథానాయిక హ్యూమా ఖురేషితో కలసి అక్షయ్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నేనెప్పుడూ న్యాయవాది పాత్ర చేయలేదు. సో, ఈ కథ వినగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. న్యాయవ్యవస్థపై సెటైరికల్‌ సినిమా కాదిది... అందులో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నమూ చేయలేదు.


వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన కామెడీ మూవీ ఇది. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఈ సీక్వెల్‌ను కొత్త కథతో తెరకెక్కించాం. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’లో హీరోగా నటించిన అర్షద్‌ వార్సితో నా నటనను పోల్చి చూస్తారని తెలుసు. అర్షద్‌ చిన్నోడు కాదు, మంచి నటుడు. నా స్నేహితుడు కూడా. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ తరహాలో ఈ సీక్వెల్‌ కూడా మంచి హిట్టవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘అక్షయ్‌తో నటించడం హ్యాపీ. సినిమాలో నాకు, ఆయనకూ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది’’ అన్నారు హ్యూమా ఖురేషి.

PREV
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్