
సూపర్ స్టార్ రజినీకాంత్ కావేరి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కారులో నివాసానికి చేరుకోవడం జరిగింది.Rajinikanth నడుము చుట్టూ ఓ బెల్ట్ చుట్టి ఉంది. ఆయన కొంచెం ఇబ్బందిగా నడుస్తున్న భావన ఆ ఫోటో చూస్తే అనిపించింది. అయితే రజినీ కాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారన్న వార్త అభిమానులలో జోష్ నింపింది. తరచుగా రజినీకాంత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో ఆయన వారం రోజులకు పైగా చికిత్స తీసుకున్నారు.
రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. హఠాత్తుగా ఆసుపత్రిలో చేరడం రజనీ ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారని, ఆరోగ్యం బాగానే ఉన్నారని వైద్యలు, ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశారు. నిన్నటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అనేక పరీక్షల అనంతరం మెదడు రక్తనాళ్లల్లో బ్లాంక్స్ గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స జరుగుతుందన్నారు.
మరోవైపు రజనీకాంత్ `Annatthhe` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో `పెద్దన్న` పేరుతో విడుదల కాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. శివ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. రజనీకి చెల్లిగాKeerthy suresh, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేష ఆదరణ పొందింది.
Also read rajinikanth health update: మెదడులో బ్లాక్స్ గుర్తించిన వైద్యులు
ఇటీవల రజనీకాంత్ ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్ అటు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిశారు.
Also read హీరో నాగ శౌర్య ఫార్మ్ హౌస్ లో పట్టుబడిన పేకాట బ్యాచ్