అంజలి-ప్రియదర్శి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం

Published : Oct 31, 2021, 09:40 PM IST
అంజలి-ప్రియదర్శి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం

సారాంశం

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూత‌న చిత్రం ప్రారంభమైంది. 

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూత‌న చిత్రం ప్రారంభమైంది. వ‌రుస స‌క్సెస్ ఫుల్ సినిమాల‌తో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకొని విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థ‌గా ఇమేజ్ అందుకున్న జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ 7గా ఈ నూత‌న చిత్రం రాబోతుంది.  

Also read Bigg boss telugu5: సిరికి ఐ లవ్ యూ చెప్పిన దేవరకొండ బ్రదర్... ఉబ్బితబ్బి అవుతున్న బేబీ!

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్ష‌కాధ‌‌ర‌ణ అందుకున్న ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ హీరోయిన్ అంజ‌లి, ప్ర‌ముఖ న‌ట‌లు రావు ర‌మేశ్, ప్రియ‌ద‌ర్శీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మెలోడీ బ్ర‌హ్మా మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా మొద‌లైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

Also read శ్రీరామ్ ని సేవ్ చేసిన అవికా గోర్.. చుక్కలు చూపించిన అవినాష్, బాబా భాస్కర్.. మామూలు రచ్చ కాదు

నటీనటులు: 

ప్రియదర్శి, అంజలి, రావు రమేష్..


టెక్నికల్ టీమ్: 

దర్శకుడు: కరుణ కుమార్

సమర్పణ: అల్లు అరవింద్
బ్యానర్: GA 2 పిక్చర్స్

నిర్మాతలు: బన్నీ వాస్, విద్య మాధురి

సంగీతం: మణిశర్మ

స‌హ‌నిర్మాత: బాబు

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫర్: అరుల్ విన్సెంట్

ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

PREV
click me!

Recommended Stories

Rajinikanth : 75 ఏళ్ల వయసులో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద