హీరో నాగ శౌర్య ఫార్మ్ హౌస్ లో పట్టుబడిన పేకాట బ్యాచ్

Published : Oct 31, 2021, 10:21 PM ISTUpdated : Oct 31, 2021, 10:28 PM IST
హీరో నాగ శౌర్య ఫార్మ్ హౌస్ లో పట్టుబడిన పేకాట బ్యాచ్

సారాంశం

సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న..  కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సుమారు 20 మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్‌ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న..  కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సుమారు 20 మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరివద్ద నుండి నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇక్కడ వీకెండ్ లో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ప్రతివారం ఇక్కడకు బడా బాబులు వచ్చి పేకాటలో తమ అదృష్టం పరీక్షించుకుంటారని తెలుస్తుంది. ఇటీవల నటుడు కృష్ణుడు తో పాటు మరికొంత మంది పేకాట ఆడుతూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఓ అపార్ట్మెంట్ లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. వెంటనే వారు స్టేషన్ నుండి విడుదల కావడం జరిగింది. తాజాగా హీరో Naga shaurya ఫార్మ్ హౌస్ లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది. 

Also read Bigg boss telugu5: సిరికి ఐ లవ్ యూ చెప్పిన దేవరకొండ బ్రదర్... ఉబ్బితబ్బి అవుతున్న బేబీ!
మరోవైపు నాగ శౌర్య నటించిన Varudu kavalenu చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 

Also read Bigg Boss Telugu5: రెచ్చిపోయి డాన్స్ చేసిన దివి, మోనాల్.. హాట్ హాట్ గా అదరగొట్టేశారు
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే