Mahesh babu: షాకింగ్ న్యూస్...  మహేష్ బాబుకు సర్జరీ!

Published : Dec 02, 2021, 07:46 AM IST
Mahesh babu: షాకింగ్ న్యూస్...  మహేష్ బాబుకు సర్జరీ!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఇది. సర్కారు వారి పాట సినిమా షూట్ కి బ్రేక్ పడింది. దానికి కారణం మహేష్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే. ఆయనకు ఓ సర్జరీ జరగనుందని సమాచారం.   


మహేష్ బాబు (Mahesh babu)నుండి మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది. 2020 సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు విడుదల కావడం జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ తర్వాత మహేష్ కి భారీ గ్యాప్ వచ్చింది. సరిలేరు నీకెవ్వరు మూవీ అనంతరం దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ చిత్రం చేయాల్సి ఉంది. దాదాపు సెట్స్ పైకి వెళ్లాల్సిన సమయానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. మహేష్ వంశీ చెప్పిన స్క్రిప్ట్ లో మార్పులు కోరారని, దాని కోసం  ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు కథనాలు వెలువడ్డాయి. మహేష్ కి నిర్మాతలకు రెమ్యునరేషన్ విషయంలో సంధి కుదరకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిందన్న మరో ప్రచారం కూడా జరిగింది. 


వంశీ ప్రాజెక్ట్ క్యాన్సిలైన కొన్నాళ్లకు దర్శకుడు పరుశురాం తో మహేష్ సర్కారు వారి పాట (Sarkaru vaari paata) ప్రకటించారు. కోవిడ్ పరిస్థితుల కారణం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిలే కావడం జరిగింది. కాగా మరో రెండు నెలలు సర్కారు వారి పాట షూట్ కి బ్రేక్ పడనుందంటూ సమాచారం అందుతుంది. మహేష్ బాబు ఓ సర్జరీ చేయించుకోవాల్సి ఉండగా... సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ రెండు నెలల తర్వాతే అంటున్నారు. 


చాలా కాలంగా మహేష్ మోకాలు సమస్యతో బాధపడుతున్నారట. నడవడం ఇబ్బంది అవుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించారట. దీనితో మహేష్ మోకాలు సర్జరీకి సిద్దం అయ్యారట. సర్జరీ అనంతరం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో కొన్నిరోజుల పాటు మహేష్ షూటింగ్ కి హాజరయ్యే అవకాశం లేదని అంటున్నారు. అయితే సర్కారు వారి పాట మూవీ విడుదలపై దీని ప్రభావం ఉండదని తెలుస్తుంది. 

Also read ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్‌.. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌ విరాళాలు..

ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు చేరింది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ మూవీ సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ 1న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక దర్శకుడు పరశురాం బ్యాంకింగ్ మోసాలు, స్కామ్స్ వంటి ఆర్ధిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మహేష్ రెండు భిన్నమైన రోల్స్ లో కనిపిస్తారని వినికిడి. సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Also read Akhanda reveiw:అఖండ ప్రీమియర్ రివ్యూ.. బాలయ్య ఊర మాస్ జాతర.. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్