Bigg Boss Telugu 5: సిరి, శ్రీరామ్‌లకు చుక్కలు చూపించిన సన్నీ.. షణ్ముఖ్‌ శాపనార్థాలకు కన్నీళ్లు..

Published : Dec 01, 2021, 11:43 PM IST
Bigg Boss Telugu 5: సిరి, శ్రీరామ్‌లకు చుక్కలు చూపించిన సన్నీ.. షణ్ముఖ్‌ శాపనార్థాలకు కన్నీళ్లు..

సారాంశం

 సన్నీ బంతుల బకెట్‌ కింద పడిపోయింది. ఇక సన్నీ రెచ్చిపోయాడు. ఎదురుదాడికి ప్రయత్నించాడు. సన్నీ ఎటాకింగ్‌కి ఇతర సభ్యులు వణికిపోయారు. ముఖ్యంగా సిరి, శ్రీరామ్‌, పింకీలకు చుక్కలు చూపించాడు సన్నీ. 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)లో ఫైనల్‌కి చేరే టాస్క్ నడుస్తుంది. ఇందులో గెలుపొందిన వాళ్లు డైరెక్ట్ గా ఫైనల్‌కి క్వాలిఫై అవుతారు. టాప్‌ 5లో నిలుస్తారు. అందులో భాగంగా ప్రస్తుతం `టికెట్‌ టు ఫినాలే` టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో ఐస్‌ క్యూబ్‌పై నిల్చొని తమకి కేటాయించిన బంతులను కాపాడుకుంటూ, ఇతరుల బంతులను లాక్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. హౌజ్‌లో మరోసారి వివాదానికి తెరలేపినట్టయ్యింది. 

ఇందులో సిరి, సన్నీల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ముందుగా సన్నీ..సిరి వద్ద బంతులు తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ఐస్‌లో కాలు పెట్టినట్టు చెప్పింది. దీంతో ఒక బంతి తీసుకున్నాడు సన్నీ. ఆ తర్వాత సన్నీ బంతులపై సిరి ఎటాక్‌ చేసింది. దీంతో సన్నీ బంతుల బకెట్‌ కింద పడిపోయింది. ఇక సన్నీ రెచ్చిపోయాడు. ఎదురుదాడికి ప్రయత్నించాడు. సన్నీ ఎటాకింగ్‌కి ఇతర సభ్యులు వణికిపోయారు. ముఖ్యంగా సిరి, శ్రీరామ్‌, పింకీలకు చుక్కలు చూపించాడు సన్నీ. వారిపై బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎటాక్‌ చేయడంతో తమ కాళ్లని కంటిన్యూగా ఐస్‌లోనే పెట్టాల్సి వచ్చింది. 

అయితే సన్నీ.. ఎటాక్‌తో సిరి బంతుల బకెట్‌ కింద పడిపోయింది. దీనికి సిరి ఫైర్‌ అయ్యింది. తన కాళ్లు ఐస్‌లోనే ఉన్నాయని, తనపై అన్యాయంగా ఎటాక్‌ చేశాడని కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటి తర్వాత సన్నీశాంతించి ఆమె బంతుల్ని ఏరి బకెట్‌లో వేశాడు. కానీ కంటిన్యూగా వారిపై ఎటాకింగ్‌ మూడ్‌లో ఉండటంతో సిరి, శ్రీరామ్‌, పింకీ ఐస్‌లోనేకాళ్లు పెట్టారు. దీంతో వాళ్ల కాళ్లు ఐస్‌కి గాయానికి గురయ్యాయి. నడవలేని పరిస్థితి నెలకొంది. సిరి అయితే కన్నీళ్లు పెట్టుకుంది. డాక్టర్ల సహకారంతో వాళ్లకి ట్రీట్‌మెంట్‌ చేశారు బిగ్‌బాస్‌. 

అయితే ఇలా జరగడంపై షణ్ముఖ్‌ ఫైర్‌ అయ్యాడు. ఇంత దారుణంగా బిహేవ్‌ చేస్తారా అంటూ శాపనార్థాలు పెట్టాడు. వరుసగా ఫైర్‌ అవ్వడంతో సన్నీ ఏమాత్రం రియాక్ట్ కాలేదు. కానీ గార్డెన్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన్ని మానస్‌, కాజల్‌ ఓదార్చారు. ఆ తర్వాత ఈ గేమ్‌ని ఆపేశాడు బిగ్‌బాస్‌. దీని తర్వాత మరో గేమ్‌ `ఫోకస్‌ టాస్క్` ని ఎంచుకున్నారు. దీని ప్రకారం బిగ్‌బాస్‌ బజర్‌ మోగిన సమయంలో ఇద్దరు జంట టైమ్‌ మిషిన్‌ వద్ద కూర్చీలో కూర్చని ఏకాగ్రత కోల్పోకుండా,మాట్లాడుకుండా, కళ్లర్పకుండా ఉండాల్సి ఉంటుంది. ఇందులో మానస్‌-పింకీ ఒక జంటగా, సన్నీ-కాజల్‌ ఒకజంటగా, సిరి-షణ్ముఖ్‌ ఒక జంటగా పాల్గొన్నారు. ఈ గేమ్‌ ఇంకా కొనసాగుతుంది.

ప్రస్తుతం Bigg Boss Telugu 5 షో 13వ వారం సాగుతుంది. ఈ వారంలో నామినేషన్లలో షణ్ముఖ్‌, సన్నీ తప్ప పింకీ, కాజల్‌, సిరి, శ్రీరామ్‌, మానస్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా,ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు హౌజ్‌ నుంచి 12 మంది ఎలిమినేట్‌ అయ్యారు. గత వారం రవి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. రవి ఎలిమినేషన్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కావాలని రవిని బిగ్‌బాస్‌ నిర్వహకులు ఎలిమినేట్‌ చేశారనే విమర్శలు వచ్చాయి. 

also read: బ్లౌజ్‌ విప్పేసి రకుల్‌ పిచ్చెక్కించే లుక్‌.. విరహమా? ఆవేదనా? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే